RRR - Alia Bhatt: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో రీ జాయిన్ అయిన ఆలియా భట్.. పిక్ చేసిన సీత..

RRR షూటింగ్‌లో జాయన్ అయిన ఆలియా భట్ (Twitter/Photo)

RRR - Alia Bhatt: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఆలియా భట్ జాయిన్ అయ్యారు.

  • Share this:
    RRR - Alia Bhatt: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తైయింది. ఇప్పటికే ఈ సినిమా మేకింగ్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఓ సారి ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఓ ఎనిమిది నెలలు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతులతో కొంత కాలం షూటింగ్ చేశారు. ఇక మరోసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది.  తాజాగా ఈ  సినిమా షూటింగ్‌లో ఆలియా భట్ తిరిగి జాయిన్ అయింది. దానికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు.

    RRR - Alia Bhatt Re Starts Rajamouli RRR Shooting Today Share Pic From Set,RRR - Alia Bhatt: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ మళ్లీ అయిన ఆలియా భట్.. పిక్ చేసిన సీత..,RRR - Alia Bhatt,RRR,Alia Bhatt,Alia Bhatt Resumes RRR Shooting,lia Bhatt As Sita,RRR Movie, Alia Bhatt, Alia Bhatt RRR movie, RRR movie Alia Bhatt, Alia Bhatt look, Alia Bhatt look RRR,Alia Bhatt Twitter,Alia Bhatt Instagram,Alia Bhatta NTR Jr,Rajamouli,Ram Charan,ఆర్ఆర్ఆర్, అలియా భ‌ట్, ఆర్ఆర్ఆర్‌లో అలియా, అలియా భ‌ట్ ఫ‌స్ట్‌లుక్, ఆలియా భ‌ట్ ప్రీ లుక్, సీత‌గా ఆలియా,సీతగా ఆలియా భట్
    సీతగా ఆలియా భట్ (Twitter/Photo)


    ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, ఆలియా భట్‌లపై ఓ పాటను పిక్చరైజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన థియేట్రికల్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్‌తో పాటు ఈమె కథానాయికగా నటించిన ‘గుంగుబాయ్ కతియావాడి’ సినిమా చేసింది. ఈ సినిమా జూలై 30న విడుదల కానుంది. మరోవైపు అమితాబ్, నాగార్జున ముఖ్యపాత్రల్లో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తోన్న ‘బ్రహ్మాస్త్ర’ అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: