Home /News /movies /

RRR ACTRESS OLIVIA MORRIS HAS A DAY OUT IN HYDERABAD PHOTOS GOES VIRAL NR

RRR - Olivia Morris: హైదరాబాద్ వీధుల్లో ఆర్ఆర్ఆర్ హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

RRR - Olivia Morris

RRR - Olivia Morris

RRR - Olivia Morris: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం "RRR". పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    RRR - Olivia Morris: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం "RRR". పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో నటించగా,హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ కూడా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా శనివారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్ పూర్తి చేసుకున్న ఒలీవియా అలా సరదాగా హైదరాబాద్ వీధులలో చక్కర్లు కొట్టారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న అనురెడ్డితో కలిసి ఈమె హైదరాబాద్ వీధులలో సందడి చేశారు.

    అను రెడ్డితో కలిసి శిల్పారామం సందర్శించిన నటి అక్కడ ప్రకృతి అందాలను, హస్తకళలకు ఎంతో ఫిదా అయినట్టు తెలుస్తోంది. అలాగే అను రెడ్డి సదరు నటికి హైదరాబాద్ పానీపూరి రుచిని చూపించారు. ఈ క్రమంలోనే వీటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ తన రోజు ఎంతో సరదాగా ఆనందంగా గడిచిందని తెలియజేశారు. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బామ సందడి చేయనున్నారు.

    ఇది కూడా చదవండి:అవకాశం వచ్చిందని రాజమౌళిపైనే సెటైర్లు వేశారుగా.. కంటపడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ పరిస్థితేంటో?

    గత కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రబృందం ముందుగా అనుకున్న తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

    ఇది కూడా చదవండి:వామ్మో.. ఇక్కడ ఉన్నది ఆర్ఆర్ఆర్ హీరోయినా.. ఇలా ఉందేంటి?

    ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అలాగే స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘దోస్తీ’అనే పాట యూ ట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించడం వల్ల ఇతర భాషల నుంచి ఎంతో గుర్తింపు పొందిన నటీనటులు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published:

    Tags: American actress, Hollywood film Actress, Hyderabad, NTR, Olivia Morris, Rajamouli, Ram Charan, RRR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు