• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RRR ACTRESS ALIA BHATT WISHES PAWAN KALYAN VAKEEL SAAB BEFORE RELEASE VIDEO GOES VIRAL SRD

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ క్యూట్ క్యూట్ మాటలు..ఏం చెప్పిందో తెలుసా..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్  గురించి అలియా భట్ క్యూట్ క్యూట్ మాటలు..ఏం చెప్పిందో తెలుసా..

పవన్ కళ్యాణ్ గురించి అలియా భట్ క్యూట్ క్యూట్ మాటలు..ఏం చెప్పిందో తెలుసా..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ (Pawan Kalyan Vakeel Saab) సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమావిడుదల కాబోతుండడంతో పలువురు సినీ ప్రముఖులు పవన్ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

  • Share this:
    పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలకు కౌంట్ డౌన్ ముగిసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేసారు. పవన్ కళ్యాణ్ లేకుండా మిగతా టీమ్ మొత్తం వరుస ఇంటర్వ్యూల్లో బిజీగా గడిపారు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో కనిపించి సినిమాకు తన వంతు సహకారం అందించారు. ఈ సినిమా తెలంగాణ, ఏపీతో పాటు ఓవర్సీస్‌లో దాదాపు 700కు పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల కానుంది. కరోనా తర్వాత ఇంత భారీ ఎత్తున ఓ సినిమా విదేశాల్లో ప్రీమియర్స్ పడటం ఇదే మొదటిసారి. ఇప్పటికే యూఎస్‌లో కొన్ని చోట్ల ప్రీమియర్స్ కూడా పడ్డాయి. ఇక ఈ సినిమావిడుదల కాబోతుండడంతో పలువురు సినీ ప్రముఖులు పవన్ టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అయితే ఈ సినిమాతో పాటు థియేటర్లలో తమ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేస్తున్నామని ఆలియా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. "పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యాన్స్ బీ రెడీ వకీల్‌సాబ్ వచ్చేస్తున్నాడు" అంటూ తెలుగులో క్యూట్ క్యూట్‏గా ఆలియా "వకీల్‌సాబ్" యూనిట్‌కి విష్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియలో వైరల్‌గా మారింది.

    ప్రస్తుతం ఈ అమ్మడు దర్శకదీరుడు రాజమౌళీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అలియాతోపాటు హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్ గణ్ కీలక పాత్రలలో నటిస్తుండగా.. పలువురు హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాను దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‏తో డీవీవీ దానయ్య తెరకెక్కిస్తుండగా.. అక్టోబర్ 13 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్.


    ఇటీవల అలియా సీత (Alia Bhatt) ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని ఇటీవల విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా కొద్ది రోజుల క్రితం ఆలియా కూడా తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిందని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా సోకిందని తెలిసిన వెంటనే తాను సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లానని తెలిపింది. డాక్టర్లు ఇచ్చిన సూచనల ప్రకారం మెరుగైన వైద్యం అందుకోవడంతో ఆలియా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకుంటుంది. మరోవైపు కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న వకీల్ సాబ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో భారీగానే రాబట్టింది. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత మేరకు రాబడుతుందో చూడాలి. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏ మేరకు ఉంటాయనేది చూడాలి. అజ్ఞాతవాసి కూడా ఫస్ట్ డే ఓ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టింది. కానీ కరోనా సమయంలో విడుదలైవుతున్న "వకీల్ సాబ్" ఎంత మేరకు కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపుడుతుందనేది చూడాలి.
    Published by:Sridhar Reddy
    First published: