విజయ్ దేవరకొండ‌కు ఫిదా అంటోన్న బాలీవుడ్ భామ..

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

news18-telugu
Updated: December 5, 2019, 10:47 AM IST
విజయ్ దేవరకొండ‌కు ఫిదా అంటోన్న బాలీవుడ్ భామ..
Instagram/thedeverakonda
  • Share this:
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు విజయ్. ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో మరింతగా ఎదిగాడు. కాగా ఆయన ఇటీవల నటించిన 'డియర్ కామ్రెడ్' సినిమా కొంత నిరాశ పరిచింది.  అది అలా ఉంటే.. ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్ ట్రై చేస్తూ ఇంతకుముందెన్నడూ విధంగా.. ఏ తెలుగు హీరో కనిపించని రీతిలో కనిపిస్తూ ప్రేక్షకుల మనసు కొల్లగొట్టాడు విజయ్. దీంతో ఈ కుర్ర హీరో క్రేజ్ తెలుగులోనే కాదు హిందీలో కూడా కనిపిస్తోంది. తన స్టైలింగ్‌ డ్రెస్ సెన్స్‌తో అక్కడి స్టార్ హీరోయిన్ల మనసులను దోచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే కైరా అద్వానీ తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు కైరా, విజయ్ కలిసి ఓ యాడ్‌లో నటించి మురిపించారు. కాగా తాజాగా ఇప్పుడు మరొక స్టార్ నటి అలియా భట్ సైతం విజయ్ తన ఫేవరెట్ హీరో అంటోంది. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న అలియాను... మీకు ఈ యేడాదిలో బాగా నచ్చిన మోస్ట్ గ్లామరస్ స్టార్స్ ఎవరని అడగ్గా దానికి సమాధానం చెబుతూ తనకిష్టమైన గ్లామర్ నటి అనుష్క శర్మ అని, నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.క్రేజీ ఫోజులతో కైపెక్కిస్తోన్న హుమా ఖురేషి...
First published: December 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>