Home /News /movies /

RRR 9TH DAY COLLECTIONS RAM CHARAN RAJAMOULI NTR RRR COLLECTIONS WORLD WIDE HERE ARE THE DETAILS SR

RRR : తొమ్మిదో రోజు ఆర్ ఆర్ ఆర్ ప్రభంజనం.... ఈ రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఎవరి తరం కాదేమో...

ఆర్ ఆర్ ఆర్ Photo : Twitter

ఆర్ ఆర్ ఆర్ Photo : Twitter

RRR Collections : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.

ఇంకా చదవండి ...
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం)  (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 710 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్‌లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 11 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఆర్ ఆర్ ఆర్ (Roudram Ranam Rudhiram) బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇక రెండో వారంలో అడుగు పెట్టింది. ఈ సినిమా తొమ్మిదో రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఊహకందని విధంగా.. ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ప్రభంజనం స‌‌ృష్టించింది. అంతేకాదు తొమ్మిదో రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 37.12 కోట్ల షేర్ సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

    తొమ్మిది రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
    Nizam: 90.10Cr
    Ceeded: 41.98Cr
    UA: 24.60Cr
    East: 12.89Cr
    West: 11.00Cr
    Guntur: 15.46Cr
    Krishna: 12.17Cr
    Nellore: 7.40Cr
    AP-TG Total:- 215.60CR(323.05CR~ Gross)
    KA: 32.05Cr
    Tamilnadu: 30.10Cr
    Kerala: 8.95Cr~
    Hindi: 80.10Cr
    ROI: 5.70Cr
    OS – 79.50Cr
    World Wide Total : 452.00CR(Gross- 820CR~)

    ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క కోటి వసూల్ చేస్తే బ్రేక్ అయ్యి.. ఓవరాల్ గా క్లీన్ హిట్ అవుతుంది. తొమ్మిది రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు అంటున్నారు. తొమ్మిది రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాహుబలి 2 సినిమా 9వ రోజు 6.51 కోట్ల అందుకుంది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు ఉంది. ఆ తర్వాత అల వైకుంఠపురములో ఉంది. దీంతో ఆర్ ఆర్ ఆర్ 9వ రోజు కలెక్షన్స్‌ రికార్డ్‌ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశం లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.


    ఇక ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు.


    ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ నటులు  (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు.  అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ  (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్  (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: RRR, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు