RRR 8TH DAY COLLECTIONS RAM CHARAN RAJAMOULI NTR RRR COLLECTIONS WORLD WIDE HERE ARE THE DETAILS SR
RRR : ఆర్ ఆర్ ఆర్ 8వ రోజు కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత వసూలు చేయాలంటే..
RRR Collections : Twitter
RRR Collections : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా మొదటి వారం పూర్తి అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 710 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 11 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఆర్ ఆర్ ఆర్ (Roudram Ranam Rudhiram) బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇక రెండో వారంలో అడుగు పెట్టింది. ఆర్ ఆర్ ఆర్ రెండో వారంలో మొదటి రోజు అయిన 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ సినిమా 8వ రోజు 7 కోట్ల రేంజ్ కలెక్షన్స్ అనుకుంటే దాన్ని దాటేసి 8.33 కోట్ల షేర్‌ను అందుకుంది. ఇక వరల్డ్ వైడ్‌గా గా ఈ సినిమా ఏకంగా 22 కోట్ల కి పైగా షేర్‌ను వసూలు చేసింది.
8 రోజుల్లో ఆర్ ఆర్ ఆర్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
Nizam: 81.53Cr
Ceeded: 38.63Cr
UA: 21.75Cr
East: 11.67Cr
West: 10.08Cr
Guntur: 14.43Cr
Krishna: 11.14Cr
Nellore: 6.75Cr
AP-TG Total:- 195.98CR(292.50CR~ Gross)
KA: 29.60Cr
Tamilnadu: 27.15Cr
Kerala: 8.50Cr~
Hindi: 71.80Cr
ROI: 5.45Cr
OS – 76.40Cr
ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ : 414.88CR(Gross- 751CR), ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ అంటే ఇంకా 38.12 కోట్ల షేర్‌ను రాబట్టాలి.
AP TG 8th Day All Time Highest Share Record Now Belongs To #RRRMovie - 8.33Cr💥💥💥💥
ఇక ప్రమోషన్లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు.
RRR Photo : Twitter
ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ నటులు (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.