RRR 5 DAYS WORLD WIDE BOX OFFICE COLLECTIONS RAJAMOULI JR NTR RAM CHARAN CONTINUES SENSATION AT BOX OFFICE TA
RRR 5 Days World Wide Collections : ఆర్ఆర్ఆర్ 5 రోజుల వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. రూ. 600 కోట్ల క్లబ్బులో చేరిన మూవీ..
RRR 5 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)
RRR 5 Days World Wide Collections : : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఐదు రోజుల్లో మంచి వసూళ్లనే సాధించి తాజాగా రూ. 600 కోట్ల క్లబ్బులో చేరింది.
RRR 5 Days World Wide Collections : ఆర్ఆర్ఆర్రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్,రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. అక్కడక్కడా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తోన్న ఒక తెలుగు వాడైన రాజమౌళి.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.
ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా గత శుక్రవారం (25/3/2022)న విడుదలై మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. నాలుగు రోజులు మంచి వసూళ్లనే సాధించిన ఈ సినిమా ఐదో రోజు కాస్త జోరు తగ్గినా.. బాక్సాఫీస్ దగ్గర మంచి పట్టును నిలబెట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమ ా రికార్డు బ్రేక్ ఓపెనింగ్స్‌ను రాబట్టి ట్రేడ్ సైతం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఐదో రోజు ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 6.70 + రూ. 6.93 కోట్లు కలిపి మొత్తంగా 13.63 కోట్లు(రూ. 20.45 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 17.45.కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా ఐదో రోజు ఈ సినిమా రూ. 31.08 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఐదో రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 170.63 కోట్లు (రూ. 253.10 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదో రోజు వరకు రూ. 348.18 కోట్ల షేర్ రాబట్టి మంచి హోల్డ్ క్రియేట్ చేసింది. హిందీలో మొదటి రోజు తక్కువే వచ్చినా రెండో రోజు నుంచి పుంజుకుంది. ఓవరాల్‌గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 453 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా ఐదు రోజులు కలిపి రూ. 348.8 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే..ఇంకా రూ. 104.82 కోట్లు షేర్ రాబట్టాలి. హిందీలో కూడా రికార్డు స్థాయి వసూళ్లను ఈ సినిమా రాబడుతోంది. మొత్తంగా ఈవీకెండ్ వరకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.