హోమ్ /వార్తలు /సినిమా /

RRR 4 days WW collections: ‘RRR’ 4 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్..

RRR 4 days WW collections: ‘RRR’ 4 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్..

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫేమస్ డైలాగులు (RRR Collections)

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఫేమస్ డైలాగులు (RRR Collections)

RRR 4 days WW collections: సాధారణంగా మూడు రోజులు ఎలా ఉన్నా.. నాలుగో రోజు కచ్చితంగా సినిమా వసూళ్లపై ప్రభావం పడుతుంది. కానీ ట్రిపుల్ ఆర్ మాత్రం దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, హిందీ, కన్నడ, తమిళంలో రికార్డు వసూళ్లు సాధించింది. మండే టెస్ట్ డిస్టింక్షన్‌లో పాస్ అయింది ఈ చిత్రం.

ఇంకా చదవండి ...

సాధారణంగా మూడు రోజులు ఎలా ఉన్నా.. నాలుగో రోజు కచ్చితంగా సినిమా వసూళ్లపై ప్రభావం పడుతుంది. కానీ ట్రిపుల్ ఆర్ మాత్రం దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, హిందీ, కన్నడ, తమిళంలో రికార్డు వసూళ్లు సాధించింది. మండే టెస్ట్ డిస్టింక్షన్‌లో పాస్ అయింది ఈ చిత్రం. రాజమౌళి (Rajamouli) మరోసారి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈయన తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ (RRR 1st Weekend WW collections) సినిమా సంచలన వసూళ్లతో దూసుకుపోతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మునుపెన్నడూ ఇండియన్ సినిమా చూడనటువంటి కలెక్షన్లు తీసుకొస్తుంది. 4 రోజుల్లోనే ఏకంగా 317 కోట్ల షేర్.. 565 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అసలు ఈ స్థాయిలో ఇండియన్ సినిమాకు వసూళ్లు వస్తాయా అనేంతగా రెచ్చిపోతుంది ఈ చిత్రం. బాహుబలి 2 అనుకుంటే.. దాన్ని మించిపోయి ఈ సినిమాకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్స్ వచ్చాయి.

నైజాం: 61.65 కోట్లు

సీడెడ్: 37.82 కోట్లు

ఉత్తరాంధ్ర: 17.81 కోట్లు

ఈస్ట్: 9.67 కోట్లు

వెస్ట్: 8.65 కోట్లు

గుంటూరు: 12.67 కోట్లు

కృష్ణా: 9.30 కోట్లు

నెల్లూరు: 5.43 కోట్లు

ఏపీ, తెలంగాణ 4 డేస్ కలెక్షన్స్: 157.00 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 4.20 కోట్లు

కర్ణాటక: 22.30 కోట్లు

తమిళనాడు: 18.90 కోట్లు

కేరళ: 5.35 కోట్లు

హిందీ: 45.50 కోట్లు

ఓవర్సీస్: 63.80 కోట్లు

వరల్డ్ వైడ్ 4 డేస్ కలెక్షన్స్: 317.10 కోట్లు

ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 451 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 317 కోట్ల షేర్ వచ్చింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు నాలుగో రోజు 17.73 కోట్ల షేర్ వచ్చింది. మరో 137 కోట్లు వసూలు చేస్తే సినిమా హిట్ అవుతుంది. ప్రస్తుతం సినిమా సాగుతున్న తీరు చూస్తుంటే ఫస్ట్ వీక్‌లోనే అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ అయిపోయేలా కనిపిస్తుంది. నాలుగో రోజు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడంతో పండగ చేసుకుంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఐదో రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పైగా హిందీలోనూ మంచి గ్రోత్ కనిపిస్తుంది. వీక్ డేస్‌లో వచ్చే కలెక్షన్లను బట్టి సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంది. అన్ని చోట్లా ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తీసుకొస్తుంది.

First published:

Tags: Rrr movie, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు