Home /News /movies /

RRR 24 DAYS WORLD WIDE COLLECTIONS JR NTR RAM CHARAN GOT GOOD COLLECTIONS TA

RRR 24 Days WW Collections : ‘ఆర్ఆర్ఆర్’ 24 డేస్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. కేజీఎఫ్ 2 హవాలో కూడా మంచి వసూళ్లు..

RRR 24 రోజుల కలెక్షన్స్ (RRR Collections : Photo : Twitter)

RRR 24 రోజుల కలెక్షన్స్ (RRR Collections : Photo : Twitter)

RRR 24 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. కేజీఎఫ్ 2 వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో డీసెంట్ వసూళ్లను సాధించింది.

    RRR 24 Days World Wide Box Office Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమాకు థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చిందనే చెప్పాలి.  ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.  ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.

    ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా 24 రోజు కేజీఎఫ్ 2 వచ్చినా డీసెంట్ వసూళ్లను రాబట్టింది.  ఈ సినిమా తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 43 లక్షలు + రూ. 83 లక్షలు మొత్తంగా రూ. 1.26 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్, తమిళనాడు, కర్ణాటక మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.09 కోట్లు రాబట్టింది. ఈ రెండు కలిపితే ప్రపంచ వ్యాప్తంగా 24వ రోజు ఈ సినిమా రూ. 4.35 కోట్లు షేర్ (రూ. 11 కోట్లు గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 24 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే..

    Nagarjuna: ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జున డూప్‌గా నటించింది ఈ స్టార్ హీరోనే.. ఇంత ఎవరో తెలుసా..

    నైజాం (తెలంగాణ):  రూ. 109.67 కోట్లు  /రూ . 70 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 50.05 కోట్లు  / రూ. 37 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 34.21 కోట్లు / రూ. 22 కోట్లు
    ఈస్ట్: రూ. 15.81 కోట్లు  / రూ. 14 కోట్లు
    వెస్ట్: రూ. 12.93 కోట్లు /రూ. 12 కోట్లు
    గుంటూరు: రూ. 17.77 కోట్లు / రూ. 15 కోట్లు
    కృష్ణా:రూ. 14.31 కోట్లు  / రూ. 13 కోట్లు
    నెల్లూరు: రూ. 9.09 కోట్లు / రూ. 8 కోట్లు

    Telagana - AP : రూ. 263.84 కోట్లు (రూ. 398.10 కోట్లు)

    KGF 2 - RRR - Bahubali : కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి సహా భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాలు..


    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 263.84 కోట్లు (రూ. 398.10 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

    కర్ణాటక: రూ. 42.75 కోట్లు / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 37.50 కోట్లు  / రూ. 35 కోట్లు
    కేరళ:  10.35 కోట్లు  / రూ. 9 కోట్లు
    హిందీ: 124.60 కోట్లు  / రూ. 92 కోట్లు

    రెస్టాఫ్ భారత్ : రూ.9 కోట్లు / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 98 కోట్లు  / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 586.04 కోట్లు షేర్ (రూ.1082.00 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

    ఆర్ఆర్ఆర్ మొదటి రోజు.. రూ. 135 కోట్లు ( 235 కోట్లు గ్రాస్ )
    రెండో రోజు : రూ. 67.44 కోట్లు  (121 కోట్లు గ్రాస్ )
    మూడో రోజు : రూ. 78.73 కోట్లు (రూ. 140 కోట్లు గ్రాస్ )
    నాలుగో రోజు : రూ. 35.88 కోట్లు  (రూ. 69 కోట్లు గ్రాస్)
    ఐదో రోజు : రూ. 31.13 కోట్లు (రూ. 60 కోట్లు గ్రాస్)
    ఆరో రోజు : రూ. 23.19 కోట్లు (రూ. 45 కోట్ల గ్రాస్ )                                                                        ఏడో రోజు : రూ. 21.08 కోట్లు (రూ, 40 కోట్ల గ్రాస్ )                                                                 ఎనిమిదో రోజు: రూ. 22.03 కోట్లు (41 కోట్ల గ్రాస్)                                                                        తొమ్మిదో రోజు : రూ. 37.12 కోట్లు (రూ. 69 కోట్ల గ్రాస్)                                                                  పదో రోజు : రూ. 44.80 కోట్లు (రూ. 80 కోట్ల గ్రాస్)                                                                        పదకొండో రోజు : రూ. 12.68 కోట్లు (రూ. 20 కోట్ల గ్రాస్)                                                                  పన్నెండో రోజు : రూ. 11.58 కోట్లు (రూ. 18.50 కోట్ల గ్రాస్)                                                              పదమూడో రోజు : రూ. 7.44 కోట్లు (రూ. 14.50 కోట్ల గ్రాస్)                                                              పద్నాలుగో రోజు : రూ. 6.71 కోట్లు (రూ. 14 కోట్ల గ్రాస్)                                                                  పదిహేనో రోజు : రూ. 5.90 కోట్లు (రూ. 13 కోట్ల గ్రాస్)
    పదహారో రోజు:  రూ. 10.40 కోట్లు (రూ. 23 కోట్ల గ్రాస్                                                                    పదిహేడో రోజు :  రూ. 12.91 కోట్లు (26.35 కోట్లు గ్రాస్)

    పద్దెమ్మిదో రోజు  : రూ. 4.03 కోట్లు (రూ. 10.15 కోట్ల గ్రాస్)
    పంతొమ్మిదో రోజు :  రూ. 2.66 కోట్లు (రూ. 6.50  కోట్లు గ్రాస్)
    ఇరవై రోజు :  రూ. 1.37 కోట్లు (రూ. 2.90 కోట్ల గ్రాస్ )
    21వ రోజు :  రూ. 2.91  కోట్లు (రూ. 6.65 కోట్ల గ్రాస్ )
    22వ రోజు  : రూ. 2.93 కోట్లు (రూ. 7.00 కోట్ల గ్రాస్)
    23వ రోజు  : రూ. 2.87 కోట్లు (రూ. 7.00 కోట్ల గ్రాస్ )
    24వ రోజు :  రూ. 4.35 కోట్లు (రూ. 11.00 కోట్ల గ్రాస్)

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 24 రోజుల్లో కలిపి  రూ. 572.48 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా హిందీలో రూ. 124.60 కోట్ల షేర్.. (రూ. 250 కోట్ల గ్రాస్ ) వసూళు చేసింది. ఈ లోపు టోటల్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 133.04 కోట్ల లాభాలతో సూపర్ హిట్ స్టేటస్‌ అందుకుంది. కేజీఎఫ్ 2 రాకతో ఆర్ఆర్ఆర్ జోరు తగ్గే అవకాశాలున్నా మంచి వసూళ్లనే దక్కించుకోవడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    తదుపరి వార్తలు