RRR 1st Weekend WW collections: రాజమౌళి (Rajamouli) మరోసారి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈయన తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ (RRR 1st Weekend WW collections) సినిమా సంచలన వసూళ్లతో దూసుకుపోతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మునుపెన్నడూ ఇండియన్ సినిమా చూడనటువంటి కలెక్షన్లు తీసుకొస్తుంది.
రాజమౌళి (Rajamouli) మరోసారి ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తున్నాడు. ఈయన తెరకెక్కించిన ‘ట్రిపుల్ ఆర్’ (RRR 1st Weekend WW collections) సినిమా సంచలన వసూళ్లతో దూసుకుపోతుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మునుపెన్నడూ ఇండియన్ సినిమా చూడనటువంటి కలెక్షన్లు తీసుకొస్తుంది. మూడు రోజుల్లోనే ఏకంగా 275 కోట్ల షేర్.. 486 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అసలు ఈ స్థాయిలో ఇండియన్ సినిమాకు వసూళ్లు వస్తాయా అనేంతగా రెచ్చిపోతుంది ఈ చిత్రం. బాహుబలి 2 అనుకుంటే.. దాన్ని మించిపోయి ఈ సినిమాకు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ ఏరియా వైజ్ కలెక్షన్స్ వచ్చాయి.
ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే 451 కోట్లు వసూలు చేయాలి. కేవలం మూడో రోజు ఈ సినిమాకు 75 కోట్ల వరకు షేర్ వచ్చింది. నాలుగో రోజు కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పైగా హిందీలోనూ మంచి గ్రోత్ కనిపిస్తుంది. వీక్ డేస్లో వచ్చే కలెక్షన్లను బట్టి సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంది. అన్ని చోట్లా ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్ తీసుకొస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.