Home /News /movies /

RRR 1ST DAY WORLD WIDE BOX OFFICE COLLECTIONS RAJAMOULI JR NTR RAM CHARAN CREATS NEW SENSATION AT INDIAN BOX OFFICE TA

RRR 1st Day World Wide Collections : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర రాజమౌళి కలెక్షన్ల సునామీ..

ఆర్ఆర్ఆర్ మూవీ ఫష్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ మూవీ ఫష్ట్ డే వాల్డ్ వైడ్ కలెక్షన్స్ (Twitter/Photo)

RRR 1st Day World Wide Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రికార్డు క్రియేట్ చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లను రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    RRR 1st Day World Wide Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే భారీ విజయం విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు.  అక్కడక్కడా ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తోన్న ఒక తెలుగు వాడైన రాజమౌళి.. బాహుబలి తర్వాత మరోసారి ఆర్ఆర్ఆర్ మూవీతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. 

    ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం (25/3/2022)న విడుదలై మంచి టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమ ా రికార్డు బ్రేక్ ఓపెనింగ్స్‌ను రాబట్టి ట్రేడ్ సైతం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. మొదటి రోజు  ప్రీమియర్స్‌తో కలిపి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు రాబట్టిందంటే..

    RRR - Nizam Day 1 Top 10 Share Movies : ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ డే నైజాం కలెక్షన్స్.. అన్ని రికార్డులు ఖల్లాస్..

    నైజాం (తెలంగాణ):  రూ. 23.35 కోట్లు (రూ. 39 కోట్లు గ్రాస్ ) /రూ . 75 కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 17 కోట్లు  / రూ. 45 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 7.42 కోట్లు / రూ. 23 కోట్లు
    ఈస్ట్: రూ. 5.39 కోట్లు  / రూ. 15 కోట్లు
    వెస్ట్: రూ. 5.93 కోట్లు /రూ. 13కోట్లు
    గుంటూరు: రూ. 7.80 కోట్లు / రూ. 17 కోట్లు
    కృష్ణా:రూ. 4.21 కోట్లు  / రూ. 14 కోట్లు
    నెల్లూరు: రూ. 3.01 కోట్లు / రూ. 9 కోట్లు

    తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 74.11 కోట్లు (రూ. 107 కోట్లు గ్రాస్)/ రూ. 211 కోట్లు

    కర్ణాటక: రూ. 8.15 కోట్లు(16.10 కోట్లు)  / రూ. 41 కోట్లు
    తమిళనాడు: రూ. 4.95 కోట్లు(రూ. 10.10 కోట్లు)  /రూ. 35 కోట్లు
    కేరళ:  1.74 కోట్లు (3.85 కోట్లు గ్రాస్) / రూ. 9 కోట్లు
    హిందీ: 9.25 కోట్లు (23.50 కోట్లు గ్రాస్)  / రూ. 92 కోట్లు                                                                రెస్టాఫ్ భారత్ : రూ. 2.80 కోట్లు (6 కోట్లు గ్రాస్) / రూ. 8 కోట్లు
    ఓవర్సీస్: రూ. 34 కోట్లు (69 కోట్లు గ్రాస్ ) / రూ. 75 కోట్లు)
    వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్:రూ. 135 కోట్లు (రూ. 235.55 కోట్ల గ్రాస్) / రూ. 451 కోట్లు

    RRR : ఆ ఏరియాలో బాహుబలి 2 రికార్డ్స్‌ను టచ్ చేయలేకపోయిన ఆర్ఆర్ఆర్.. మొత్తంగా ఎన్నో ప్లేస్ అంటే..

    ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 135 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైమ్ ఇండియా రికార్డు బద్దలు కొట్టింది. హిందీలో తక్కువ కలెక్షన్స్ వచ్చినా.. ఓవరాల్‌గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడించింది. అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మాలి. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 453 కోట్ల షేర్ రాబట్టాలి. మొత్తంగా మొదటి రోజు రూ. 135 కోట్ల షేర్‌తో మంచి వసూళ్లే రాబట్టింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే..ఇంకా  రూ. 318 కోట్లు షేర్ రాబట్టాలి. హిందీలో కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టాలి.  ఇదే ఊపు కంటిన్యూ అయితే బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద విషయమేమి కాదు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటన్నదే చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు