హోమ్ /వార్తలు /సినిమా /

RP Patnaik: ఆర్పీ ఇండ‌స్ట్రీకి దూరం అవ్వ‌డానికి అస‌లు కార‌ణ‌మిదేన‌ట‌‌.. రివీల్ చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్

RP Patnaik: ఆర్పీ ఇండ‌స్ట్రీకి దూరం అవ్వ‌డానికి అస‌లు కార‌ణ‌మిదేన‌ట‌‌.. రివీల్ చేసిన మ్యూజిక్ డైరెక్ట‌ర్

ఆర్పీ ప‌ట్నాయ‌క్

ఆర్పీ ప‌ట్నాయ‌క్

సంగీత ప్రియుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఆర్పీ పట్నాయక్ (RP Patnaik). ఈయన పాటలు ఒక్కసారి వింటే పదే పదే విందామనిపిస్తాయే కానీ ఎక్కడా బోరింగ్‌గా అనిపించవు. అలా రాణించిన ఆయన.. ఎందుకో అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు..?

ఇంకా చదవండి ...

RP Patnaik: టాలెంట్ ఉంటే చాలు సినీ ఇండస్ట్రీలో అవకాశాలకు కొదువే ఉండదు. అలా వచ్చి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన వారు తొలి తరం నుంచి ఇప్పటి వరకూ వందల మంది ఉన్నారు. అదే విధంగా వచ్చిన దారిలోనే కొందరు వెనక్కి తిరిగి వెళ్లిపోగా.. మరికొందరూ తమ సత్తా ఏంటో చాటి చెప్పి నాటి నుంచి ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్‌లోనే కొనసాగుతూ వస్తున్నారు. ఆ కోవలోనే సంగీత దర్శకులూ చాలా మందే ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం, నటనపై అమితమైన మక్కువతో నానా కష్టాలు పడి.. తిండిలేక ఇబ్బందులు పడుతూ చిన్నపాటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని టాప్‌లో నిలిచి సంగీత ప్రియుల మనసులో స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఆర్పీ పట్నాయక్. ఈయన పాటలు ఒక్కసారి వింటే పదే పదే విందామనిపిస్తాయే కానీ ఎక్కడా బోరింగ్‌గా అనిపించవు. అలా రాణించిన ఆయన.. ఎందుకో అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు..? ఎందుకబ్బా అని ఆరా తీస్తే కారణాలు ఏవేవో అంటూ వార్తలు వచ్చాయి గానీ అసలు విషయం తెలియరాలేదు. ఇప్పటి వరకూ బడా హీరో అక్కినేని నాగార్జునే ఆర్పీ దూరమవ్వడానికి కారణమని వార్తలూ వచ్చాయి. అయితే అసలు ఆయన ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది..? ఆ లాంగ్ గ్యాప్‌కు కారణమెవరు..? అనే విషయాలను స్వయానా ఆర్పీనే వెల్లడించాడు.

‘నీకోసం’ (1999) సినిమాతో మ్యూజిక్ కెరీర్ ప్రారంభించిన ఆయన.. ‘మనలో ఒక్కడు’ (2016) చిత్రంతో ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అంటే సుమారు 17 ఏళ్లపాటు తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలకు కూడా మ్యూజిక్ అందిస్తూ.. మరోవైపు నటిస్తూ మన్ననలు పొందాడు. ఆయన మ్యూజిక్ అందించిన.. స్వరం అందించిన సాంగ్స్ బోలెడన్ని సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాకుండా సినిమా హిట్టవ్వడానికి కూడా కారణమయ్యాడు. అలాంటి ఆర్పీ సడన్‌గా కనిపించకుండా పోవడంతో ఎన్నెన్నో పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటిపై ఇప్పటి వరకూ స్పందిచని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ వేదికగా స్పందిస్తూ ఆ పుకార్లు.. అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘నేనున్నాను’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమానే ఆర్పీ ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం.

చెప్పకపోవడంతో..

ఎందుకంటే.. ‘సంతోషం’ సినిమాకు మ్యూజికల్ హిట్టిచ్చిన ఆర్పీని.. తదుపరి సినిమా ‘నేనున్నాను’కు కూడా ఆయన్నే తీసుకోవడం జరిగింది. అయితే చిన్నపాటి కమ్యునికేషన్ గ్యాప్ వల్ల ఆర్పీ ఈ సినిమా చేయలేకపోయాడు. ఆ తర్వాత కూడా ఏ సినిమానూ చేయలేక ఏకంగా సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉంటూ వస్తున్నాడు. వాస్తవానికి ‘నేనున్నాను’ చిత్రానికి రెండు, మూడు ట్యూన్‌లు చేయడానికి ఆర్పీకే అవకాశం దక్కింది. అంతా అనుకున్నట్లుగానే ఆయన ట్యూన్స్ కూడా రెడీ చేసుకున్నాడు కూడా. అయితే సడన్‌గా అమెరికా వెళ్లాల్సి రావడంతో వెళ్లిపోయారాయన. ఇలా అమెరికా వెళ్తున్నట్లుగానీ.. వెళ్లి వచ్చాక ట్యూన్స్ సంగతి గానీ చూద్దామని చిన్న మాటైనా చెప్పకుండా అమెరికాకు వెళ్లిపోవడం.. ఈ విషయాన్ని ఆర్పీ మేనేజర్ కూడా చిత్ర యూనిట్‌కు చెప్పకపోవడంతో.. ఆయన ఇండియా తిరిగొచ్చేసరికి జరగాల్సింది అంతా జరిగిపోయిందట.

ఇదీ అసలు కారణం..

‘నేనున్నాను’ టీమ్‌కు- ఆర్పీ మేనేజర్‌కు మధ్య ఉన్న కమ్యునికేషన్ గ్యాప్‌తో సీన్ మొత్తం మారింది. ఆర్పీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని.. టీమ్ భావించిందట. ఆర్పీ తిరిగి రాగానే ఓ పెద్ద మనిషి ఆయన దగ్గరికొచ్చి.. ‘నువ్వు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉంటే బిజినెస్ జరగడం లేదు.. అందువల్ల నిన్ను తప్పించాం..’ అని ఒక్క మాటతో బాంబ్ పేల్చాడట. ఆ మాట విన్న ఆర్పీ ఒక్కసారిగా షాక్ అయ్యాడట. ఇదేంటి అని ఆలోచించే సమయం కూడా తీసుకోకుండానే.. నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని భావించిన ఆర్పీ.. ఇకపై తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో పూర్తిగా సినిమాలకు దూరమైనట్లు స్వయానా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నాగార్జున గురించి కూడా ఆర్పీ మాట్లాడాడు. ఇంతవరకూ నాగ్ కారణమని వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలే.. ఆయనకు దీనికి ఎలాంటి సంబంధమే లేదు.. నిజానికి నాగ్.. నేను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడుకుంటామని.. బాస్ చాలా మంచి వ్యక్తి అని ఆర్పీ కితాబిచ్చారు. సో.. ఆర్పీ ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం అదన్న మాట.

First published:

Tags: Tollywood, Tollywood Movie News

ఉత్తమ కథలు