హోమ్ /వార్తలు /సినిమా /

Sunny: బిగ్ బాస్ విన్నర్ సన్నీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు

Sunny: బిగ్ బాస్ విన్నర్ సన్నీపై దాడి... పోలీసులకు ఫిర్యాదు

సన్నీపై దాడి

సన్నీపై దాడి

బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ ట్రోఫీ అందుకున్నారు. తన ఆటతీరు… ప్రవర్తనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

 బిగ్ బాస్ 5 సీజన్ (Bigg Boss Telugu ) విన్నర్ గా గెలిచిన సన్నీపై దాడి జరిగింది. ప్రస్తుతం సన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా హైదరాబాద్‌(Hyderabad)లోని హస్తినాపురం ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న బిగ్‌బాస్ విజేత సన్నీ(VJ Sunny)పై బుధవారం ఓ రౌడీషీటర్ దాడికి యత్నించాడు. హీరోపై దాడికి యత్నించగా, వెంటనే సిబ్బంది సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక సన్నీ బుల్లితెరపై వచ్చే బిగ్ బాస్ షోతో పాపులర్ అయ్యాడు. బిగ్‏బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ ట్రోఫీ అందుకున్నారు. తన ఆటతీరు… ప్రవర్తనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా… బిగ్‏బాస్ సీజన్ 5 కప్పు అందుకున్నాడు. సన్నీ 1989లో ఖమ్మంలో పుట్టాడు. అతడి అసలు పేరు అరుణ్ రెడ్డి. సన్నీ తల్లి కళావతి స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్. ఇక సన్నీ స్కూలింగ్ మొత్తం ఖమ్మంలోనే పూర్తిచేశారు.ఆ తర్వాత ఖమ్మం స్టడీ సర్కిల్లో సీఈసీ గ్రూపుతో ఇంటర్ ఫస్టియర్ చదివారు.

ఆ తర్వాత తన తల్లి వృత్తి రీత్యా కరీంనగర్ బదిలీ కావడంతో అక్కడ సెకండ్ ఇయర్ పూర్తిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్ చేశారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు సన్నీ. అతను వేసిన అల్లాదీన్ నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్‏గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‏గా పనిచేశారు. తన కెరీర్‏లో పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు సన్నీ.

సన్నీ నటించిన  కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్  జయసూర్య అలియాస్ జై పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు సన్నీ. అలాగే మరోవైపు వెండితెరపై హీరోగా పరిచయం కానున్నారు సన్నీ. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సకలగుణాభి రామా. డైమండ్ రత్నబాబు డైరెక్షన్‌లో కొత్త మూవీ పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయి.

బిగ్ బాస్ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ హౌస్ నుంచి​ బయటికి వచ్చాక సినిమాలు చేస్తున్నాడు సన్నీ. 'సకల గుణాభిరామ' సినిమాలో హీరోగా నటించిన సన్నీ.. డైలాగ్ రైటర్, 'సన్నాఫ్ ఇండియా' (Son of India) మూవీ డైరెక్టర్ డైమాండ్ రత్నబాబుతో న్యూ మూవీ ప్రకటించాడు.

First published:

Tags: Bigg Boss, Bigg boss telugu, Sunny

ఉత్తమ కథలు