నటనే కాదు, తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఏకంగా ప్యాన్ ఇండియా హీరోగా ప్రయత్నం చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు.
బాక్సింగ్‌తో పాటు ఇప్పుడు ఈ రౌడీ హీరో ఇప్పుడు మోటార్సైకిలింగ్లోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ లైగర్‌లో విజయ్ దేవరకొండ బాక్సర్ అనేది తెలిసిన విషయం కాగా.. ఇప్పుడు మరి విజయ్ దేవరకొండ బైక్రేసింగ్కు సంబంధించిన ట్రైనింగ్ ఎందుకు తీసుకుంటున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే లైగర్ కంటే ముందే విజయ్ దేవరకొండ.. ఆనంద్ దర్శకత్వంలో బైక్ రేసర్ క్యారెక్టర్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. బడ్జెట్ పరిమితుల కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఎలాగూ లైగర్‌తో ప్యాన్ ఇండియా హీరోగా మారుతోన్న విజయ్ దేవరకొండ, ఆ సినిమాను రీస్టార్ట్ చేస్తాడని అందుకే బైక్ రేసింగ్ పాఠాలను నేర్చుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
లైగర్ విషయానికి వస్తే .. ఈ సినిమా షూటింగ్ త్వరలో అని పూరీ అండ్ టీమ్ చెప్పారు కానీ.. ఎప్పటి నుంచి అనేది స్పష్టంగా చెప్పలేదు. త్వరలోనే ఆ క్లారిటీ కూడా వచ్చేయనుంది. ఇందులో అనన్యపాండే హీరోయిన్గా నటిస్తుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమై ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Liger Movie, Puri Jagannadh, Vijay Devarakonda, Vijay devarakonda liger