Home /News /movies /

ROWDY HERO VIJAY DEVARAKONDA AND PURI JAGANNADH LIGER MOVIE RELEASE DATE ANNOUCED TOMORROW MHN

Vijay Deavarakonda - Liger: సందు చూసుకుని చిందు వేస్తానంటోన్న విజయ్ దేవ‌ర‌కొండ, పూరీ జగన్నాథ్ ‘లైగ‌ర్‌’

Rowdy Hero Vijay Devarakonda and Puri Jagannadh Liger Movie Release date annouced tomorrow

Rowdy Hero Vijay Devarakonda and Puri Jagannadh Liger Movie Release date annouced tomorrow

Vijay Deavarakonda - Liger: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘లైగర్’ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ తెలిపారు.

    న‌ట‌నే కాదు, త‌న‌దైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ, లుక్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు ఏకంగా ప్యాన్ ఇండియా హీరోగా ప్ర‌య‌త్నం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘లైగ‌ర్‌’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ సినిమా మార్ష‌ల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. దీనికి సంబంధించి మార్ష‌ల్ ఆర్ట్స్‌లోనూ రౌడీ హీరో ట్రైనింగ్ తీసుకున్నాడు.

    ఇక కోవిడ్ ప్ర‌భావ స‌మ‌యంలో కామ్‌గా ఉన్న లైగ‌ర్ టీమ్ త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్నారు. ఎప్ప‌టి నుంచి అనేది స్ప‌ష్టంగా చెప్పలేదు. త్వ‌ర‌లోనే ఆ క్లారిటీ కూడా వ‌చ్చేయ‌నుంది. అంతా బాగానే ఉంది. రీసెంట్ టైమ్‌లో చిన్న స్టార్ నుంచి పెద్ద స్టార్ వ‌ర‌కు అంద‌రూ త‌మ త‌మ సినిమా రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసుకున్నారు. కానీ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ప్యాన్ ఇండియా డెబ్యూమూవీ లైగ‌ర్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌లేదు. దీని గురించి రౌడీ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అంద‌రి నిరీక్ష‌ణ‌ను రేప‌టితో పూర్తి చేస్తామ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నిర్మాత క‌ర‌ణ్‌జోహార్‌, పూరీ తెలిపారు. ‘‘దమ్మున్నోడి ఎంటర్‌టైనింగ్‌పంచ్ లైగ‌ర్‌తో ఇవ్వ‌నున్నాడు. లైగ‌ర్ మీ ద‌గ్గ‌ర్లోని థియేట‌ర్స్‌లోకి ఎప్పుడు వ‌చ్చేస్తాడో రేపు ఉద‌యం 8 గంట‌ల 14 నిమిషాల‌కు తెలియ‌జేస్తాం’’ అని తెలియ‌జేస్తూ క‌ర‌ణ్‌జోహార్ ట్వీట్ చేశారు.




    బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌పాండే హీరోయిన్‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌మై ఉన్నారు. జూలై 23న లైగ‌ర్ విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్న త‌రుణంలో రేపు మేక‌ర్స్ ఎలాంటి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తారో చూడాలి.
    Published by:Anil
    First published:

    Tags: Ananya Panday, Charmme kaur, Liger Movie, Puri Jagannadh, Vijay Devarakonda

    తదుపరి వార్తలు