Karthika Deepam: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం మరింత ఆసక్తిగా మారింది. జైల్లో ఉన్న కార్తీక్ ను నిర్దోషిగా బయటకు తీసుకొని రావడానికి దీప చేసే ప్రయత్నాలు.. చనిపోయిందనుకున్న మోనిత మళ్లీ రావడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇదిలా ఉంటే ఏసీపీ రోషిణి కార్తీక్ ను ఇంటరాగేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తన ప్రశ్నలతో కార్తీక్ నుండి నిజం రప్పించాలని తెగ ప్రయత్నిస్తుంది. కోపంతో అరుస్తుంది. అయినా కూడా కార్తీక్ ఓపికగా తాను ఈ నేరం చేయలేదంటూ చెప్పినా కూడా రోషిణి మాత్రం వార్నింగ్ ఇస్తూనే ఉంది. ఇక అంజి.. మొత్తానికి దుర్గ ను కలిసి తన గురించి తెలుసుకుంటాడు. అదే సమయంలో దీప.. వారణాసి తో వచ్చి దుర్గను పలకరించి.. జరిగిన విషయాలన్నీ చెబుతుంది. దుర్గా మోనితపై మరింత కోపాన్ని పెంచుకుంటాడు. ఇక డాక్టర్ బాబు ఈ నేరం చేయలేదని అన్నాడని దీప అనడంతో.. మోనితను వెతికే పనిలో మేము ఉంటాము అని దీపకు ధైర్యం ఇస్తారు అంజి, దుర్గ.
మోనిత, రత్న సీత కూర్చొని భోజనం చేస్తారు. కార్తీక్ గురించి మోనిత.. రత్న సీత ను అడుగుతుంది. ఇక రత్నసీత మోనిత కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలిపింది. గతంలో రత్న సీత అక్క ప్రాణాలు మోనిత కాపాడినందుకు తనకు ఈ సహాయం చేస్తుంది. కానీ రత్న సీత తన డ్యూటీ గురించి తెగ భయపడుతుండగా మోనిత నేనున్నాను అంటూ ధైర్యం ఇస్తుంది.
దీపా పిల్లలకు భోజనం పెడుతున్న సమయంలో భాగ్యం, మురళి కృష్ణ వచ్చి పలకరిస్తారు. గుడిలో సోదమ్మ చెప్పిన విషయాన్ని తెలుపుతారు. అంతేకాకుండా గుడిలో పూజారి చెప్పిన విషయాన్ని కూడా తెలుపుతారు. ఇక రోషిణి ఇంటికి వెళ్లిన సౌందర్య.. రోషిణితో మాట్లాడుతుంది. ఇక తను కార్తీక్ ను ఇంటరాగేషన్ చేసిన విషయాన్ని తెలుపుతుంది. అందులో కార్తీక్ తను హత్య చేయలేదన్న విషయాన్ని కూడా తెలుపుతుంది.
వెంటనే సౌందర్య కార్తీక హత్య చేయలేదన్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే షాక్ అవుతుంది. ఇక రోషిణి మాత్రం మోనితను చంపిన గన్ సౌందర్యదే అంటూ.. అందులో మరో బుల్లెట్ గురించి మాట్లాడుతూ.. మరో 24 గంటల్లో ఆ బుల్లెట్ ఇవ్వమని లేదంటే మిమ్మల్ని కూడా అరెస్టు చేయవలసి వస్తుందని డెడ్ లైన్ ఇస్తుంది రోషిణి. ఇక తరువాయి భాగంలో గుడికి వచ్చిన దీపను మోనిత తన వెంట తెచ్చుకున్న గన్ తో షూట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Acp roshini, Doctor babu, Karthika deepam, Rathna Seetha, Rowdy durga, Soundarya, Vantalakka