హోమ్ /వార్తలు /సినిమా /

Vijay Devarakonda - Dabbo Ratnani: విజయ్ దేవరకొండ మరో రికార్డు.. సౌత్ నుంచి తొలి హీరోగా గుర్తింపు..

Vijay Devarakonda - Dabbo Ratnani: విజయ్ దేవరకొండ మరో రికార్డు.. సౌత్ నుంచి తొలి హీరోగా గుర్తింపు..

పైగా గత రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

పైగా గత రెండు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Vijay Devarakonda - Dabbo Ratnani: యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని(Dabbo Ratnani) క్యాలెండర్‌లో చోటు సంపాదించాడు.

ఇంకా చదవండి ...

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నేషనల్ వైడ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు మరో రికార్డు సొంతం చేసుకున్నాడు. పాపులర్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్‌లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్స్ సరసన విజయ్ ఆ క్యాలెండర్‌లో కనిపించాడు. సౌత్ ఇండియా నుంచి ఈ క్యాలెండర్‌లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. చేసిన 9 సినిమాలకే ఇలాంటి నేషనల్ క్రేజ్ సంపాదించడం గమనార్హం. దీనికి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ చేశాడు డబూ రత్నాని. రగ్గ్డ్ అండ్ స్టైలిష్ లుక్‌లో విజయ్ సెక్సీగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ లాంచ్ చేసిన సందర్భంగా విజయ్ దేవరకొండతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ముచ్చటించాడు డబూ.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ ఫొటోషూట్ చాలా తొందరగా, చాలా క్వాలిటీగా జరిగింది. కొన్నేళ్ల నుంచి నాకు నచ్చిన ఎంతో మంది స్టార్స్ మీ క్యాలెండర్‌లో కనిపించారు. నేను షారుఖ్ ఖాన్ సర్‌ను మీ క్యాలెండర్‌లో చూసా. తను చాలా మంచి వ్యక్తి. అప్పటి నుంచి నాకు మీ క్యాలెండర్‌లో కనిపిస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఫైనల్‌గా నా కోరిక నెరవేరింది అని చెప్పుకొచ్చాడు.


అలాగే డబూ రత్నాని మాట్లాడుతూ.. థాంక్యూ విజయ్ దేవరకొండ నా క్యాలెండర్‌లో డెబ్యూ చేసినందుకు. మీరు చాలా కూల్ పర్సన్. ఈ ఫొటోషూట్ చేసినపుడు చాలా ఎంజాయ్ చేసాను. నా క్యాలెండర్‌లో కనిపించిన ఫస్ట్ సౌత్ యాక్టర్ మీరు. నేను షూట్ చేసిన బెస్ట్ డెబ్యూ ఫొటోషూట్ మీదే. థాంక్యూ.. అని తెలిపారు.

First published:

Tags: Dabboo Ratnani Calender, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు