news18-telugu
Updated: September 24, 2019, 5:19 PM IST
సాయి పల్లవి (Photo/Twitter)
సాయిపల్లవి సంచలనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈమె కనిపిస్తే చాలు.. అభిమానులు అస్సలు ఊరుకోవడం లేదు.. యూ ట్యూబ్‌లో రికార్డులు పిలిచి మరీ ఇస్తున్నారు. ఇప్పుడు మరోసారి సాయిపల్లవి సత్తా చూపించింది. ఇప్పటికే ‘ఫిదా’ సినిమాలోని వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే పాట యూ ట్యూబ్‌లో 221 మిలియన్ వ్యూస్‌తో రికార్డులన్నీ కొల్లగొట్టిన సాయి పల్లవి..ఆ తర్వాత ‘రౌడీ బేబీ’ అంటూ అన్ని రికార్డులను ఫసక్ చేస్తుంది. ఈ పాట ఇప్పటి వరకు 647 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకు సాధ్యం కాని రికార్డుల మోత మోగించింది ఈ పాట.తాజాగా సాయి పల్లవి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. సాయి పల్లవి.. నానితో కలిసి నటించిన ‘ఎంసీఏ’ సినిమాలోని ఏమండోయ్ నానిగారు పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఈ రకంగా సాయి పల్లవి నటించిన మూడు సినిమాల్లోని పాటలు వంద మిలియన్ (10 కోట్ల) వ్యూస్ రాబట్టడం రికార్డు అనే చెప్పాలె. దక్షిణాదిలో ఏ హీరోయిన్‌కు కూడా ఈ రికార్డు లేదు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
September 24, 2019, 5:17 PM IST