news18-telugu
Updated: October 16, 2020, 4:06 PM IST
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సాయి పల్లవి (File/Photo)
Sai Pallavi | ప్రస్తుతం సాయి పల్లవి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ అనే హృద్యమైన ప్రేమ కథ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అది కూడా రౌడీ బేబి సాయి పల్లవి హీరోయిన్గా అక్కినేని నాగ చైతన్యతో తెరకెక్కిస్తోన్న ‘లవ్ స్టోరీ’ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల విషయానికొస్తే.. 'ఆనంద్' అనే సినిమాతో తెలుగువారికి కొత్త రకమైన సినిమాను పరిచయం చేసిన దర్శకుడు. ఆయన సునిశితమైన కథలతో సహజ సన్నివేశాలతో మనసులను హత్తుకునే మాటలతో మంచి కాఫీ లాంటీ చిత్రాలను తీస్తూ తెలుగువారి హృదయాలను దోచుకుంటున్నాడు. తన తాజా చిత్రాన్ని నాగ చైతన్య సాయి పల్లవిలు హీరో హీరోయిన్స్‌గా ఓ ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. దాదాపు రెండు నెలల నుండి పెద్ద సినిమాలేవి షూటింగ్ జరుపుకోవడం లేదు. ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్‌తో షూటింగ్ జరుపుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ ను ప్రారంభించింది చిత్రబృందం. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ కు సంబంధించిన ఫొటోలు నెట్ లోకి వచ్చేశాయి.

నాగ చైతన్య, సాయి పల్లవి Photo : Twitter
తాజాగా గండికోటలో ఈ సినిమాకు సంబందించిన ఓ పాటను షూటింగ్ చేసారు. దానికి సంబంధించి ఏకంగా వీడియోలే ప్రత్యక్షమైపోయాయి. లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ఇది ఆఖరి షెడ్యూల్. మరో వారం రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని సమాచారం. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని, థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక సాయి పల్లవి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. ఊటీకి వెళ్లింది. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్‌లో సాయి పల్లవికి సంబంధించిన ఫోటోలు నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈమెతో పాటు ఆమె చెల్లెలు పూజా కన్నన్ కూడా సాయి పల్లవి వెంట ఉంది. కొన్ని రోజులు ఊటీలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపిన తర్వాత తిరిగి షూటింగ్లో సాయి పల్లవి జాయిన్ కానుంది.

నాగ చైతన్య, సాయి పల్లవి (File/Photo)
ఇక సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ విషయానికొస్తే.. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్లో అమ్ముడుపోయాయని టాక్. ఈ సినిమా చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలికిననట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ తాజా సినిమాకు కూడా ఓవర్సీస్లో మంచి డిమాండ్ ఉందట. దానికి తోడు సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా సినిమాకు మంచి హైప్ రావడానికి కారణం అవుతోంది. ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్ నిర్మిస్తున్నాడు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 16, 2020, 4:06 PM IST