RRR : అదిరిపోయే రీతిలో ఎన్టీఆర్ ఒలివియా మధ్య రొమాన్స్..

Twitter

అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ప్రెస్టేజియస్ సినిమా RRR.

  • Share this:
    అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ప్రెస్టేజియస్ సినిమా RRR. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. రామ్ చరణ్ సరసన హిందీ నటి అలీయా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఇదే విషయాన్ని చిత్రబృందం అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్, ఒలివియాల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు అదిరిపోయే రీతిలో ఉండనున్నాయని సమాచారం. అంతేకాదు ప్రస్తుతం రాజమౌళి ఆ రొమాంటిక్ సీన్స్‌ను షూట్ చేస్తున్నారట. ఈ సన్నివేశాలు ఎన్టీఆర్ అండ్ ఒలివియా మధ్య కెమిస్ట్రీని బాగా ఎలివేట్ చేసే సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయట. కాగా ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో హిందీ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్రఖని నటిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    చీరలో రష్మీ గౌతమ్ హాట్ అందాలు..


    Published by:Suresh Rachamalla
    First published: