Home /News /movies /

ROMANTIC SCENE BETWEEN ALLU ARJUN AND RASHMIKA MANDANNA IN PUSHPA GETS DELETED SR

Pushpa | Allu Arjun : రష్మికతో ఉన్న ఆ బోల్డ్ సీన్ రేపటి నుంచి ఉండదు..

Pushpa Photo : Twitter

Pushpa Photo : Twitter

Allu Arjun |  Pushpa : అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కొంత బోల్డ్‌గా ఉన్న ఓ సీన్‌ను టీమ్ తొలగించనున్నదని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
    Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి కొంత బోల్డ్‌గా ఉన్న ఓ సీన్‌ను టీమ్ తొలగించనున్నదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... ఈ సినిమాలోని సెకండాఫ్‌లో పుష్ప తన వ్యాన్‌లో కూర్చొని శ్రీవల్లి భుజంపై చేయి వేసి ఫోన్ మాట్లాడతాడు. ఇక ఆ తర్వాత పుష్ప తన చేతిని శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్‌పై వేసినట్టుగా ఓ సీన్ ఉంటుంది. ఈ సీన్ థియేటర్‌లో చూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందిగా అనిపించినట్టు ఫీడ్ బ్యాక్ రావడంతో ఆ సీన్‌ను టీమ్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీన్ రేపటి నుంచి అంటే ఆదివారం నుంచి సినిమాలో ఉండదని సమాచారం. ఇక పుష్ప కలెక్షన్స్ విషయానికి వస్తే.. సినిమా నైజాంలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. ఇక మరోవైపు హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. పుష్ప హిందీ వెర్షన్ కి మొదటి రోజు 3.1 కోట్లు వసూలు అయ్యాయి. సరైన ప్రమోషన్స్ లేకుండా కూడా ఈ ఫిగర్ రావడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు సినీ పండితులు. పుష్ప హిందీలో వెయ్యి లోపు స్క్రీన్స్ లోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ మొత్తం సాధించడం గొప్ప విషయం అంటున్నారు.

    ఇక ఓవరాల్‌గా పుష్ప వరల్డ్ వైడ్‌గా అన్ని భాషాల్లో కలిపి 71 కోట్ల గ్రాస్‌ను సాధించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్’ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమా అమెరికాలో వన్ మిలియన్ మార్క్‌ను దాటేసింది.  ఇక ఈ సినిమాలో మిగితా పాటలతో పాటు సమంత ఐటెమ్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావాకు అదిరే రెస్పాన్స్‌ను వస్తోంది. ఉ అంటావా..ఊ ఊ అంటావా.. ( Oo Antava OoOo Antava) ను చంద్రబోస్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ పాడారు. ఇక ఈ సినిమా మొత్తం ఐదు భాషల్లో థియేట్రికల్‌తో పాటు నాన్ థియేట్రికల్ హక్కులు, ఓటిటి హక్కులు కలిపి దాదాపు 250 కోట్ల‌కు బిజినెస్‌ జరిగిందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిపారు. ఈ ఈవెంట్‌కు రాజమౌళి వచ్చి టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.


    పుష్పను తమిళ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఇక అనేక రూమర్స్ మధ్య హిందీలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎ ఎ ఫిల్మ్స్ పంపిణీ చేశారు. ఎ ఎ ఫిల్మ్స్ గతంలో బాహుబలి సినిమాలను హిందీలో పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో దాక్షాయనిగా అనసూయ, మంగలం శ్రీనుగా సునీల్‌ అదరగొట్టారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించగా.. శ్రీవల్లి పాత్రలో ఆమె మైమరిపించారు.

    Adivi Sesh Hit2: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న హిట్ 2 ఫస్ట్ గ్లింప్స్.. టాప్‌లో ట్రెండింగ్..

    ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరుపుకుంది. పుష్ప లో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలు చేశారు. ఇక ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song)  అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter, and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Allu Arjun, Pushpa Movie, Rashmika mandanna, Tollywood news

    తదుపరి వార్తలు