Puri jagannadh : పూరి జగన్నాథ్ అంటే అంతే మరి... ఆ హీరోయిన్‌కు ఆఫర్సే ఆఫర్స్...

పూరి జగన్నాథ్ Photo : Twitter

Puri jagannadh : : పూరి జగన్నాథ్ హీరోయిన్స్ అంటేనే ఆ క్రేజ్ స్కైలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డ్యాషింగ్ డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్ తర్వాత కాలం స్టార్స్ అయ్యారు.

  • Share this:
    పూరి జగన్నాథ్ హీరోయిన్స్ అంటేనే ఆ క్రేజ్ స్కైలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ డ్యాషింగ్ డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే హీరోయిన్స్ తర్వాత కాలం స్టార్స్ అయ్యారు. సూపర్ స్టార్స్ గా ఎదిగారు. రక్షిత, అశిన్, అనుష్క, నేహా శర్మ, కంగనా, దిశా పటానీ ఇలా తన పూరి తన సినిమాల్లో పరిచయం చేసిన కథానాయికలు తర్వాతి కాలంలో ఏ స్థాయికి వెళ్లారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అశిన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా అక్షయ్, సల్మాన్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది. తర్వాతి కాలంలో పెళ్లి చేసుకుని ఫిల్మ్ కెరీర్ కు దూరమైంది. నేహా శర్మా ఇప్పటికీ బాలీవుడ్ లో బిజీగానే ఉంది. ఇక కంగనా గురించి తెల్సిందే. మహేష్ భట్ కనుక గ్యాంగ్ స్టర్ సినిమాతో తనను బాలీవుడకు పరిచయం చేయకపోయి ఉంటే కనుక పూరి దర్శకత్వంలో పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ లో కనిపించి ఉండేదాన్ని, అఫ్పుడు తన కెరీర్ మరో విధంగా ఉండేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఇక అనుష్క ఏకంగా లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతోంది. సూపర్ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ కథానాయిక 15 ఏళ్లుగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పిస్తూ వస్తోంది. లోఫర్ లో వరుణ్ తేజ్ సరసన నటించిన దిశా పటానీ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఇలా పూరి బ్రాండ్ ఉన్న హీరోయిన్స్ తర్వాతి కాలంలో స్టార్స్ గా ఎదిగారు. ఒక సెంటిమెంట్ ను క్రియేట్ చేసారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే మూవీ చేస్తున్నాడు పూరి జగన్నాథ్.

    ketika sharma holi pics,ketika sharma pics,ketika sharma hot,ketika sharma,ketika sharma biography,ketika sharma hot,ketika,ketika sharma dance,ketika sharma family,ketika sharma workout,ketika sharma lifestyle,ketika sharma instagram,ketika sharma age,sharma,ketika sharma affairs,ketika sharma hot dance,ketika shama hot,ketika sharma boyfriend,ketika sharma facebook,ketika sharma instagram,ketika sharma twitter,ketika sharma age,ketika sharma size,ketika sharma insta,puri heroine,ketika sharma hot,puri jagannadh heroine,romantic heroine,కేతిక శర్మ,కేతిక శర్మ హాట్,కేతిక శర్మ హాట్ ఫోటోస్,పూరీ జగన్నాథ్,పూరీ జగన్నాథ్ హీరోయిన్,రోమాంటిక్ హీరోయిన్
    కేతిక శర్మ Photo : Instagram


    ఈ సినిమతో అనన్య పాండేను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు. తన తనయుడు హీరోగా మరో మూవీని కూడా నిర్మిస్తున్నాడు. అనిల్ పడూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీతో కేతిక శర్మ అనే హీరోయిన్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది.లాస్ట్ ఇయర్ విడుదలైన ఓ పంజాబీ సింగిల్ లో కేతిక పర్ఫామెన్స్ చూసి ఈ సినిమాలో ఆమెను ఎంపిక చేసాడు పూరి. కరోనా ప్రభావం లేకపోయి ఉంటే కనుక ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సింది. కానీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రొమాంటిక్ ఇంకా ప్రేక్షకుల ముందుకు రాలేదు అప్పుడే ఈ సినిమా హీరోయిన్ డేట్స్ కు రష్ పెరిగింది. కేతిక అఫ్పుడే సెకండ్ మూవీ కూడా సైన్ చేసేసింది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం మొదలైంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిందే. విలు విధ్య నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో నాగ శౌర్యతో కలసి రొమాన్స్ చేయనుంది కేతిక. మొత్తంగా పూరి బ్రాండ్ కేతికకు బాగానే కలిసొస్తున్నట్లు కనిపిస్తోంది.
    Published by:Suresh Rachamalla
    First published: