• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • ROJA VIJAYASHANTI SAI PALLAVI AFTER VIJAYASHANTI ROJA NOW SAI PALLAVI WILL BE SEEN IN A NAXALITE ROLE IN HER NEXT MOVIE VIRATA PARVAM MOVIE HERE ARE THE DETAILS TA

Roja - Vijayashanti - Sai Pallavi: అప్పట్లో విజయశాంతి.. ఆ తర్వాత రోజా.. ఇపుడు సాయి పల్లవి..

Roja - Vijayashanti - Sai Pallavi: అప్పట్లో విజయశాంతి.. ఆ తర్వాత రోజా.. ఇపుడు సాయి పల్లవి..

విజయశాంతి, సాయి పల్లవి, రోజా (File/Photos)

Roja - Vijayashanti - Sai Pallavi: అవును అప్పట్లో విజయ శాంతి.. ఆ తర్వాత రోజా..  ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఈ జనరేషన్‌లో సాయి పల్లవి ఈ పాత్రలో అభిమానులకు కనువిందు చేయనుంది. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Roja - Vijayashanti - Sai Pallavi: అవును అప్పట్లో విజయ శాంతి.. ఆ తర్వాత రోజా..  ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఈ జనరేషన్‌లో సాయి పల్లవి ఈ పాత్రలో అభిమానులకు కనువిందు చేయనుంది. వివరాల్లోకి వెళితే.. సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగువారి గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. తమిళ భామ అయిన సాయి పల్లవి.. మొదటగా మలయాళ సినిమా ‘ప్రేమమ్’ సినిమాలో హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకుంది. ఇక తెలుగులో ‘ఫిదా’ సినిమాలో తెలంగాణ యాసలో బాన్స్‌వాడా హైబ్రీట్ తెలంగాన అమ్మాయి పాత్రలో అలరించింది. ఈ సినిమాలో తెలంగాణ యాసలో ఆకట్టుకుంది. అలా తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా..హావ భావాలను చక్కగా ప్రదర్శించగల నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది.

    దీనికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా సాగనున్న ఈ చిత్రంలో రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది. ఈ మూవీలో సాయి పల్లవి మేకప్ లేకుండా నక్స లైట్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. గుండెల్నీ పిండిసే సన్నివేశాలతో అల్లుకున్న ఈ కథలో..సాయి పల్లవి,రానా క్యారెక్టర్స్‌ను మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరించనున్నారు.

    రోజా, విజయశాంతి


    ఈ చిత్రంలో నటి టబు కూడా ఓ కీలక పాత్రలో.. మానవ హక్కుల కోసం పోరాటం చేసే మహిళగా ఆమె పాత్ర ఉండనుంది. వీరికి తోడు మరో సీనియర్‌ నటి ప్రియమణి కూడా నక్సలైట్  పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ప్రియమణికి కామ్రేడ్ పాత్రలో ఉన్న పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వరంగల్‌, కరీంనగర్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌లలో చిత్రీకరించునున్నారు. ఇప్పటికే రానా బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    నిర్మాత సురేష్ బాబు నిర్మిస్తోన్న ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదల కానుంది. అది అలా ఉంటే..ఇంతకు ముందు ఇలా తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మా’ చిత్రంలో విజయ శాంతి నక్సలైట్ పాత్రలో జీవించింది. ఆ తర్వాత కృష్ణ హీరోగా నటించిన ‘ఎన్‌కౌంటర్’ సినిమాలో రోజా ‘స్వర్ణక్క’ పాత్రలో నటించింది. ఆ క్యారెక్టర్ హిట్ కావడంతో  ఆ తర్వాత అదే టైటిల్‌తో ‘స్వర్ణక్క’ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో నటనకు వీళ్లిద్దరు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. తాజాగా సాయి పల్లవి నటిస్తోన్న ‘విరాట పర్వం’ సినిమాతో వీళ్లలాగే  నక్సలైట్ పాత్రలో ఎలా అలరించనుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు