news18-telugu
Updated: January 1, 2020, 9:47 AM IST
రోజా (Roja )
తెలుగు లోగిళ్లలో టీవీ తెరపై జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న క్రేజ్ మరే షోకు లేదు. ప్రజల్లో అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఖతర్నాక్ కామెడీ షో. ఈ షో ఎంతో మంది కమెడియన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరెంతో మంది యువ నటులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. రీసెంట్గా నాగబాబు జడర్దస్త్ షోకు ఝలక్ ఇచ్చి.. జీ తెలుగులో ప్రసారమవుతున్న లోకల్ గ్యాంగ్స్ షోతో పాటు ‘అదిరింది’ షోకు జడ్జ్‌గా పనిచేస్తున్నారు.జీ తెలుగులో ప్రసారమయ్యే కొత్త షోతో తన కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్‌ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. కానీ ఈ షోలేవి జబర్ధస్త్ షోను రేటింగ్స్ ఏమాత్రం తగ్గించలేకపోవడం విశేషం.
ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షోలో నాగబాబు ప్లేస్‌ను ముందుగా ఆలీతో రీప్లేస్ చేయాలకున్నారు. గత రెండు వారాలుగా పోసాని కృష్ణ మురళి ఈ షోకు ఒక జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.

రోజా,పోసాని కృష్ణమురళి (Twitter/Photo)
తాజాగా రోజా జబర్దస్త్ టీమ్‌కు పోసాని కృష్ణమురళినే పర్మినెంట్ జడ్జ్‌గా నియమించమని సలహా ఇచ్చిందట. దీంతో మల్లెమాల టీమ్ మెంబర్స్.. నాగబాబు ప్లేస్‌ను పోసాని కృష్ణమురళితో పర్మినెంట్‌గా భర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారట. పైగా పోసాని కృష్ణమురళి కూడా రోజాకు చెందిన వైసీపి పార్టీకి చెందిన నేత. ఈ రకంగా రోజా తన పార్టీ వైసీపీకి చెందిన పోసాని కృష్ణమురళిని జబర్దస్త్ షోకు పర్మినెంట్ జడ్జ్‌గా ఈ సీటులో కూర్చోబెట్టిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 1, 2020, 9:47 AM IST