Roja: రష్మీ చేయి పట్టుకొని ఏడ్చేసిన రోజా.. జబర్దస్త్ వేదికపై కన్నీళ్లు
జబర్దస్త్ చివరి ఎపిసోడ్లో కన్నీళ్లు పెట్టుకున్న రోజా
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజా.. సినిమాలు, షోలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.తాజాగా ఆమె పాల్గొన్న జబర్దస్త్ షో చివరి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. ఈ సందర్బంగా రోజా వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
రోజా.. తెలుగు సినిమా ప్రేక్షకులకు... టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై రోజా ఎలా గుబాళించిందో అందరికీ తెలిసిందే. తెలుగు,తమిళ్,కన్నడ, మళయాళ భాషాల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. జబర్దస్త్ టీవీ షోలో రోజా చేసిన హడావుడి మామూలుగా ఉండదు. జబర్దస్త్ అంటే రోజా.. రోజా అంటే జబర్దస్త్ అన్నంతలా ఆ షోలో హైప్ క్రియేట్ చేశారు. అయితే తాజాగా ఆమెకు కేబినెట్ పదవి రావడంతో.. ఆమె సినిమాలకు,టీవీ షోలు చేయనని చెప్పేశారు. ఈ క్రమంలో జబర్దస్త్‌లో ఆమె చివరి ఎపిసోడ్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోజాకు టీం అంతా ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ క్రమంలో రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందర్నీ ఏడిపించి.. ఆమె కూడా ఏడ్చేశారు.
మంత్రిని కావడంతో తనకు బాధ్యతలు పెరిగాయని జబర్దస్త్ షోకు కూడా గుడ్ బై చెప్పనున్నట్లు స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో, జబర్దస్త్ టీం సభ్యులు తమ అభిమాన నటి రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె పాల్గొన్న చివరి ఎపిసోడ్ లో ఘనంగా సత్కరించారు. అయితే ఈ సందర్భంగా రోజా కన్నీటి పర్యంతమైంది. రెండుసార్లు ఎమ్మెల్యే అయినప్పుడు జబర్దస్త్ లోనే ఉన్నానని, ఇప్పుడు మంత్రి అయినప్పుడు కూడా ఇక్కడే ఉన్నానని భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. తనకు సేవ చేయడం ఎంతో ఇష్టమని, అందుకే జబర్దస్త్ వంటి ఇష్టమైన కార్యక్రమాలను వదులుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశమిచ్చిన యాజమాన్యానికి రోజా కృతజ్ఞతలు తెలిపారు.
రోజా వీడ్కోలు ఎపిసోడ్ లో యాంకర్లు, టీమ్ మెంబర్లు కంటతడి పెట్టుకున్నారు. రష్మీ చేయి పట్టుకుంటూ.. రోజా ఏడ్చేశారు. అటు రష్మీ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఇక సుడిగాలి సుధీర్, జబర్దస్త్‌కు వచ్చిన మరో జడ్జీ హీరోయిన్ పూర్ణ కూడా రోజాను చూసి కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఎప్పుడూ నవ్వులు చిందించే జబర్దస్త్ షో వేదికపై ఒకేసారి మూగబోయింది. అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకుల మన్ననలు పొందడంలో రోజా పాత్ర కూడా ఎంతో కీలకం. జడ్జిగా షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నాగబాబుతో కలిసి ఆమె జబర్దస్త్ షో ను నడిపారు. అయితే నాగబాబు షో నుంచి వెళ్లిపోయిన.. రోజా షోను సమర్థవంతంగా ముందుకు నడిపారు. ఈ షోలో ఎంతోమంది జడ్జీలు మారిన రోజా మాత్రం అలానే ఉన్నారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వచ్చారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు నగరి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీలో తాజగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో రోజా పర్యాటక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.