హోమ్ /వార్తలు /సినిమా /

Jabardasth: రోజా మాట వినని జబర్ధస్త్ కమెడియన్.. ఇప్పుడు కష్టాల్లో కెరీర్..

Jabardasth: రోజా మాట వినని జబర్ధస్త్ కమెడియన్.. ఇప్పుడు కష్టాల్లో కెరీర్..

ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించారు. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు సెల్వమణి. ఆ తర్వాత వరస సినిమాలు చేసాడు. ఈ సినిమా సమయంలోనే రోజాతో పరిచయమైంది.. ఆ పరిచయమే ప్రేమగా మారింది.

ఈ సినిమాలో ప్రశాంత్ హీరోగా నటించారు. తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు సెల్వమణి. ఆ తర్వాత వరస సినిమాలు చేసాడు. ఈ సినిమా సమయంలోనే రోజాతో పరిచయమైంది.. ఆ పరిచయమే ప్రేమగా మారింది.

Jabardasth: మళ్లీ బుల్లితెరపై కనిపించే విషయంలో చమ్మక్ చంద్ర ఆలస్యం చేస్తే.. అది ఆయన కెరీర్‌కు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని కొందరు చర్చించుకుంటున్నారు.

  జబర్ధస్త్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ నటులు తెరకు పరిచయమయ్యారు. సెలబ్రిటీలుగా మారిపోయారు. సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుని రాణిస్తున్నారు. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర ఒకరు. జబర్ధస్త్‌లో తనదైన స్టయిల్లో కామెడీని పండించి అందరి అభిమానాన్ని చురగొన్న చంద్ర... ఎంతమంది కొత్తవాళ్లు వచ్చినా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. తన రేంజ్ పెంచుకుంటూ పోయాడు. ముఖ్యమంత్రి ఫ్యామిలీ సమస్యల ఆధారంగా స్కిట్స్ చేయడంలో ఎవరైనా తన తరువాతే అని నిరూపించుకున్నాడు.

  అయితే నాగబాబు జబర్ధస్త్‌ను వీడి అదిరిందికి వెళ్లిపోవడంతో... ఆయన దారిలోనే ఆయనను నమ్ముకుని అక్కడికి వెళ్లిపోయాడు చంద్ర. అక్కడ కూడా చంద్ర హవా కొనసాగింది. కార్యక్రమం మారినా... చంద్ర స్కిట్స్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే ఈ మధ్య బొమ్మ అదిరింది కార్యక్రమం ఆగిపోవడంతో అందులోని నటుల పరిస్థితి ఏమిటనే దానిపై చర్చ మొదలైంది. అందులోనూ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ అయిన చంద్ర ఏం చేయబోతున్నారనే దానిపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన మళ్లీ జబర్ధస్త్‌కు తిరిగొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఓ విషయంలో నాగబాబుతో విభేదాల కారణంగా ఆయనతో చంద్రకు గ్యాప్ వచ్చిందని.. అది అలా అలా పెరుగుతూ పోయిందనే ప్రచారం కూడా సాగింది.

  ఈ క్రమంలోనే చంద్ర మళ్లీ జబర్ధస్త్‌లోకి వస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ వారాలు గడుస్తున్నా.. చమ్మక్ చంద్ర జబర్ధస్త్‌కు వచ్చే సంకేతాలు రావడం లేదు. దీంతో అసలు చంద్ర ఇటు వైపు మళ్లీ వస్తున్నాడా లేక ఆయన మళ్లీ ఇక్కడకు రాకుండా ఎవరైనా బ్రేకులు వేస్తున్నారా అనే వాదనలు కూడా మొదలయ్యాయి. మరోవైపు మళ్లీ బుల్లితెరపై కనిపించే విషయంలో చమ్మక్ చంద్ర ఆలస్యం చేస్తే.. అది ఆయన కెరీర్‌కు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని కొందరు చర్చించుకుంటున్నారు. వేణు, ధనరాజ్ వంటి వాళ్లే ఇందుకు ఉదాహరణ అనే వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి బుల్లితెరపై స్టార్ అనిపించుకున్న చమ్మక్ చంద్ర.. ఏదో రకంగా ఆడియెన్స్‌ను సాధ్యమైనంత తొందరగా ఎంటర్‌టైన్ చేయాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.

  మరోవైపు చంద్ర జబర్ధస్త్‌ను వీడే సమయంలో రోజా అడ్డుకున్నారని.. ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కోరారనే టాక్ కూడా వినిపిస్తోంది. అలా రోజా వద్దని చెప్పడంతో కొంతమంది కమెడియన్లు జబర్ధస్త్‌ను వీడకుండా ఉండిపోయారని.. మరికొందరు మాత్రం ఆమె మాత్రం వినకుండా బయటకు పోయారని తెలుస్తోంది. అలాంటి వారిలో ఒకటైన చమ్మక్ చంద్ర ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Chammak Chandra, Jabardasth, Roja Selvamani

  ఉత్తమ కథలు