news18-telugu
Updated: January 14, 2021, 2:39 PM IST
రోజా సెల్వమణి కుమార్తె అన్షుమాలిక
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సెల్వమణి, డైరెక్టర్ సెల్వమణిల గారాల పట్టి అన్షుమాలిక వయసులో చిన్నదైనా కూడా తన పెద్దమనసు చాటుకుంటోంది. తన తల్లిలాగే సమాజసేవలో ముందుంటోంది. ఇప్పుడే కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె పిల్లలకు సాయం చేస్తుంటుంది. ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తోంది. హైదరాబాద్ మణికొండలో ఉండే సమయంలో కూడా అన్షుమాలిక తమ ఇంటి వద్ద భవన నిర్మాణ పనులు చేసే పిల్లలను ఇంటికి తీసుకొచ్చి చక్కగా వారికి భోజనం పెట్టి, చదువుకోవడానికి, రాసుకోవడానికి కొన్ని పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇచ్చి పంపేదట. ఈ విషయాన్ని స్వయంగా రోజా సెల్వమణి తెలియజేశారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా తన కుమార్తె గురించి తెలియజేశారు. అన్షుమాలిక కూడా తాను చేసే మంచి పనులను తెలియజేసింది. తనకు పిల్లలు చదువుకోవడం అంటే ఇష్టమని, అందుకే వారి కోసం తాను సాయం చేస్తుంటానని చెప్పింది. ఏదో అప్పుడప్పుడు సాయం చేయడమే కాదు. చీర్స్ ఫౌండేషన్‌లో ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తోంది అన్షుమాలిక. తాను మాత్రమే కాదు. తన ఫ్రెండ్స్‌ను కూడా ఈ మంచి పనిలో పాలుపంచుకునేలా చేస్తుంది. ఎప్పుడైనా స్కూలు, కాలేజీలో సేవా కార్యక్రమాల కోసం డొనేషన్లు స్వీకరిస్తే అందులో ముందుంటుంది. అందరినీ ప్రోత్సహిస్తూ సమాజ సేవ చేస్తుంటుంది. సుమారు 100 మంది మెరిట్ స్టూడెంట్లను విదేశాల్లో చదివేందుకు ప్రోత్సహించేలా ఓ పెద్ద కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకుందని అన్షుమాలిక తండ్రి సెల్వమణి చెప్పారు.
అన్షుమాలిక పెద్దగా నలుగురితోనూ కలిసే మనస్తత్వం కాదట. అయితే, అమ్మ, నాన్న, నానమ్మలతో ఎక్కువ ప్రేమగా ఉంటుందట. కానీ, నలుగురితో కలసి ఉండడం మాత్రం బాగా ఇష్టమని చెప్పింది. సంక్రాంతి పండుగ అంటే తనకు ఇష్టమని, చుట్టాలు అందరితో కలసి ఉండొచ్చని చెప్పింది. అమ్మ సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల తాను పండుగలకు సొంతూళ్లకు వెళితే అందరు పిల్లలతో ఆడుకోవడానికి బాగుండేదని చెప్పింది. అన్షుమాలికకు సీ ఫుడ్ ఇష్టమట. రాయచోటి వెళితే మూడుపూటలా సీఫుడ్ తినడానికి ఉత్సాహం చూపుతుందని రోజా తెలిపారు.
అన్షుమాలిక అంతర్ముఖి. తన అభిప్రాయాలు, భావాలు బయటకు పెద్దగా వ్యక్తం చేయదట. అందుకే తనకు రచనా వ్యాసాంగం మీద దృష్టిమళ్లింది. తనలో ఉన్న ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చింది. తాజాగా, అన్షుమాలిక రాసిన షిఫ్టింగ్ పర్సెప్షన్స్ బుక్ ఇటీవల ప్రచురితమైంది. చెన్నైలో ఈ బుక్‌ను ప్రచురించారు. చిన్న వయసులో రాసినా కూడా మొదటి పుస్తకం ఎంతో అనుభవం ఉన్నదానిలా రాసిందని అందరూ అభినందించారు. ఒకే అంశం మీద భిన్న ప్రాంతాలకు చెందిన వారు, భిన్నమైన మనస్తత్వాలు ఉన్నవారు ఎలా స్పందిస్తారనే అంశంపై ఆమె షిఫ్టింగ్ పర్సెప్షన్స్ అనే బుక్ రాసింది. ఇక రెండో బుక్ కూడా రెడీ అవుతోంది. అది చదువు గురించి. పేదలకు కూడా మంచి విద్య అందాలనే కాన్సెప్ట్‌తో కొత్త బుక్ రాస్తోంది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
January 14, 2021, 2:39 PM IST