హోమ్ /వార్తలు /సినిమా /

Roja: మంత్రిగా రోజ... ఇక ఆ జబర్దస్త్ నటుడు చెలరేగిపోతాడా ?

Roja: మంత్రిగా రోజ... ఇక ఆ జబర్దస్త్ నటుడు చెలరేగిపోతాడా ?

జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన రోజా

జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన రోజా

రోజా జడ్జీగా చేసిన జబర్దస్త్ షో మాత్రం పాపులర్ అయ్యింది. ఈ షోను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ షోకు యాంకర్లుగా వ్యవహరించిన వారు.. ఈ షోలో స్కిట్స్ చేసిన వారు సైతం సెలబ్రిటీలుగా మారారు.

రోజా Roja).. ప్రస్తుతం రాజకీయ నాయకురాలు అయినా.. ఒకప్పుడు మాత్రం వెండితెర ద్వారా తెలుగు ప్రజలకు పరిచయం అయిన హీరోయిన్. ప్రముఖ స్టార్ హీరోలందరితో కలిసి నటించింది.ఎన్నో హిట్ సినిమాలు తీసి నెంబర్ వన్ హీరోయిన్‌ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత సెకండ్ ఇన్నీంగ్స్‌లో కూడా సినిమాలు చేస్తూ.. అటు టీవీ షోలలో బిజీగా మారారు. పలు షోలకు ఆమె న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అయితే రోజా జడ్జీగా చేసిన జబర్దస్త్ షో( Jabardasth Show) మాత్రం పాపులర్ అయ్యింది. ఈ షోను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ షోకు యాంకర్లుగా వ్యవహరించిన వారు.. ఈ షోలో స్కిట్స్ చేసిన వారు సైతం సెలబ్రిటీలుగా మారారు. వారికి కూడా వరుసగా బుల్లితెర నుంచి వెండితర అవకాశాలు ఎదుర్కొంటూ వచ్చాయి. యాంకర్ అనసూయ, రష్మీ సినిమాల్లో కూడా నటించారు.. నటిస్తున్నారు.

ఇక కమెడియన్లుగా కడుపబ్బా నవ్వించిన వారంతా కూడా వెండితెరపై కూడా కొందరు కమెడియన్లుగా రాణిస్తే.. మరికొందరు హీరోలుగా మారి సినిమాలు కూడా తీస్తున్నారు. ఇంతవరకు బాగానే జరిగింది. ఇప్పుడు జబర్దస్త్ షో( Jabardasth Show)కు జడ్జీగా.. షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండే రోజా.. ఈ షోను ఇక చేయనంటూ చెప్పేశారు. మంత్రిగా ఆమెకు అవకాశం రావడంతో.. ఇక రాజకీయాలపైనే తన ఫుల్ ఫోకస్ ఉంటుందని... ఇక సినిమాలు షోలు చేయనని తేల్చేశారు. దీంతో ఇప్పుడు జబర్దస్త్ షో నిర్వాహకులు, కమెడియన్స్ ఓ రకమైన సందిగ్ధంలో పడిపోయారు. అయితో ఈ షో చేసే ప్రముఖ కమెడియన్‌కు మాత్రం ఫుల్ ఫ్రీడమ్ వచ్చినట్లు కొందరు ఆడియన్స్ భావిస్తున్నారు. సదరు కమెడియన్ ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అందరిపై సెటైర్లు వేస్తూ ఆడేసుకుంటాడని అంటున్నారు.

షోలో ఎవరైనా పొలిటికల్(Political) స్కిట్స్ చేసినా.. పొలిటికల్,పర్సనల్‌గా కొందరిపై కామెంట్లు, స్కీట్స్ చేస్తుంటే.. రోజా వారిని కంట్రోల్ చేస్తూ ఉండేవారు. దీంతో రోజా ఉన్నారన్న కాస్త భయంతో అయినా కొందరు కమెడియన్లు కంట్రోల్‌లో ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆమె ఈ షోకు గుడ్ బై చెప్పడంతో ఇక వారికి రెక్కలు వచ్చినట్లే అని ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఓ ప్రముఖ కమెడియన్ మాత్రం ఈ షోలో పొలిటికల్ ఇష్యూపై ఫోకస్ చేస్తుంటాడు. వాటిని కూడా తన స్కిట్‌లో యాడ్ చేస్తూ సెటైర్లు వేస్తుంటాడు. ఇటీవలే మూవీ ఆర్ట్స్ అసోసియేషన్(MAA) అధ్యక్షుడిపై కూడా అలాగే స్కిట్ చేశాడు. ప్రొ పవన్ కళ్యాణ్‌గా, ఓ పార్టీకి అనుకూలంగా ఉండే అతగాడి..నోటికి అడ్డు అదుపు ఉండదు. యాంకర్లను కూడా ఆడేసుకుంటాడు. రోజాపై కూడా అప్పుడప్పుడు డైలాగులు వేస్తూ ఉంటాడు.

అయితే ఇన్నాళ్లు షోలో పెద్ద దిక్కుగా, ఫైర్ బ్రాండ్‌గా రోజా ఉండటంతో ఆయనను కాస్త కంట్రోల్ చేస్తూ ఉండేది. రోజా కూడా పొలిటికల్ లీడర్ కావడం, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండటంతో ... అతను కూడా కాస్త నోరు అదుపులో పెట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు రోజా జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పడంతో ఇక అతగాడిని ఎవరూ కంట్రోల్ చేయలేరని తెలుస్తోంది. ఇక స్కిట్స్‌లో పొలిటికల్ మసాలా యాడ్ చేస్తూ... అందరిపై సెటైర్లు వేయడం ప్రారంభిస్తారని అంతా భావిస్తున్నారు. మరి రోజా లేకుండా జబర్దస్త్ షో ఎలా ఉంటుంది ? కమెడియన్స్ కూడా ఎలాంటి స్కిట్స్ ఇస్తారో? తమ స్కిట్స్‌లో పొలిటికల్ సెటైర్ల డోసు పెంచుతారా అనేది కాస్త వెయిట్ చూసి చూడాల్సిందే.

First published:

Tags: Jabardast, Jabardast comedian, Jabardasth roja, Roja, Roja Selavamani

ఉత్తమ కథలు