news18-telugu
Updated: January 3, 2020, 3:02 PM IST
సినిమాలు, రాజకీయాలు రెండూ రెండు కళ్లు లాంటివి అని చెప్పుకొచ్చింది రోజా. ఏ ఒక్కటీ వదలుకోను.. రాజకీయాల్లో ఖర్చుపెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మళ్లీ యాక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. తన మానసిక సంతృప్తి కోసం కూడా నటిస్తున్నట్లు తెలిపింది. ఏదేమైనా కూడా అవసరం అనుకుంటే ప్రజల కోసం అన్నీ వదిలేయడానికి సిద్ధమే అంటుంది ఈమె.
అవును రోజా.. సింగిల్ హ్యాండ్‌తో అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. అది కూడా మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’సినిమాను బ్రేక్ చేసింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు టాప్ టెలివిజన్ ఛానెల్స్‌లో ఒకటైన ఈటీవీ ప్రతి పండక్కి ఏదో ఒక ఈవెంట్‌తో ప్రత్యేక ప్రోగ్రాములు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీలో మల్లెమాల వాళ్లు ‘ఆడవారి పార్టీలకు అర్ధాలే వేరు’ అనే స్పెషల్ ప్రోగ్రామ్ చేసారు. నాగబాబు లకుండానే రోజా ఒక్కరే సింగిల్‌గా ఈ షోను నడించారు. ఈ ప్రోగ్రామ్‌లో కమెడియన్స్, సింగర్స్,డాన్స్ మాస్టర్స్,హాట్ యాంకర్స్, రోజా ఇలా అందరు రెండు గ్రూపులుగా ఉండి.. న్యూ ఇయర్ సందర్భంగా చేసిన హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దీనిక తగ్గట్టుగానే ఆడియన్స్ నుంచి ఈ ప్రోగ్రామ్‌కు మంచి స్పందనే వచ్చింది.టెలివిజన్ తెరపై కాకుండా.. యూట్యూబ్‌లో ఈ ప్రోగ్రామ్‌ను అప్లోడ్ చేస్తే.. అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రోజాతో పాటు వర్షిణి, హైపర్ ఆది యాంకర్స్‌గా ఈ వ్యవహరించిన ఈ ప్రోగ్రామ్ కేవలం ఒక్కరోజునే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో 2 ప్లేస్‌లోకి వచ్చేసింది. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సాంగ్స్ వెనక్కి నెట్టి ముందు వరసలో వచ్చేసింది.

రోజా,మహేష్ బాబు,అల్లు అర్జున్ (File/Photos)
ప్రస్తుతానికి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాల పాటలు, ఈ ప్రోగ్రామ్ అటూ ఇటూ నెంబర్ వన్, నెంబర్ టూ స్థానంలో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ కిర్రాక్ డాన్స్,హాట్ యాంకర్స్ వర్షిణి, విష్ణఉ ప్రియ హాట్ డాన్స్ పర్ఫామెన్స్, జానీ మాస్టర్ డాన్స్ మూమెంట్స్, టీవీ రిపోర్టర్ జాఫర్, రోజాను ఇంటర్వ్యూ ఇలా అన్ని కలిపి ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
January 3, 2020, 3:02 PM IST