బాలకృష్ణతో సినిమా... అసెంబ్లీలోనే తేల్చేసిన రోజా

అసెంబ్లీలో మహిళల భద్రత అంశంపై మాట్లాడే సమయంలో... బాలకృష్ణను టార్గెట్ చేశారు రోజా.

news18-telugu
Updated: December 9, 2019, 5:32 PM IST
బాలకృష్ణతో సినిమా... అసెంబ్లీలోనే తేల్చేసిన రోజా
రోజా (ఫైల్ ఫోటో)
  • Share this:
బాలకృష్ణ బోయపాటి శ్రీను కొత్త సినిమాలో రోజా నటిస్తోందనే వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర రోజాకు ఆఫర్ చేశారని... ఇందుకు ఆమె ఓకే చెప్పారనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై రోజా ఇప్పటివరకు అఫీషియల్‌గా స్పందించలేదు. ఈ సినిమా చేస్తున్నానని గానీ... చేయడం లేదని గానీ... ఆమె ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. అయితే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమాలో రోజా నటించడంపై వైసీపీలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయనే ఊహాగానాలు వినిపించాయి. ఇవన్నీ ఎలా ఉన్నా... తాజాగా బాలకృష్ణతో నటించే విషయంపై రోజా అసెంబ్లీలోనే క్లారిటీ ఇచ్చారని పలువురు చర్చించుకుంటున్నారు.

అసెంబ్లీలో మహిళల భద్రత అంశంపై మాట్లాడే సమయంలో... బాలకృష్ణను టార్గెట్ చేశారు రోజా. గతంలో మహిళలపై బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వస్తాయేమో అని టీడీపీ భయపడుతోందని ఆమె మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో బాలకృష్ణ మహిళలపై చేసిన కొన్ని అభ్యంతరకమైన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. మరోసారి బాలకృష్ణ పేరు ప్రస్తావించకుండా ఆయనను టార్గెట్ చేశారు. గతంలో బాలకృష్ణను ఎప్పుడూ ఈ రేంజ్‌లో రోజా టార్గెట్ చేయలేదు. అయితే ఈసారి ఆమె బాలయ్యపై చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే..ఆమె బాలకృష్ణ కొత్త సినిమాలో నటించే అవకాశాలు దాదాపు లేకపోవచ్చని పలువురు భావిస్తున్నారు.
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>