సుడిగాలి సుధీర్‌కు ఆ సలహా నేనే ఇచ్చానంటున్న రోజా

సుధీర్ మా కళ్ల ముందే ఎదిగాడు, మల్టీ టాలెంటెడ్ అంటూ పొగడ్తలు కురిపించారు రోజా.

news18-telugu
Updated: November 10, 2019, 1:47 PM IST
సుడిగాలి సుధీర్‌కు ఆ సలహా నేనే ఇచ్చానంటున్న రోజా
రోజా, సుడిగాలి సుధీర్
news18-telugu
Updated: November 10, 2019, 1:47 PM IST
సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్ షో' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సుడిగాలి సుధీర్ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మయిల్లో కూడా అతనికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'ఈటీవీ'లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీ టైమింగ్‌తో అదిరిపోయే పంచులేస్తుంటాడు సుధీర్. ఓ పక్క  'జబర్దస్త్' షోలో కామెడీ పండిస్తూనే.. మరో వైపు 'ఢీ' డాన్స్ షోలో యాంకరింగ్‌, టీమ్ లీడర్‌గా రాణిస్తున్నాడు. తాజాగా సుధీర్ వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చాడు. మరికొన్ని రోజుల్లో సుడిగాలి సుధీర్ నటించిన ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా పాటల్ని తాాజగా వైసీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జిల్లో ఒకరైన రోజా విడుదల చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... సుధీర్ టాలెంట్‌ను ఆకాశానికి ఎత్తేశారు. సుడిగాలి సుధీర్ నటించిన సినిమా ఫస్ట్ సంగ్ తన చేతులమీదుగా విడుదలకావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సుధీర్ మా కళ్ల ముందే ఎదిగాడు, మల్టీ టాలెంటెడ్ అన్నారు. సుధీర్ డాన్స్, ఫెర్‌ఫామెన్స్ చూసినప్పుడు చాలా సార్లు తనను హీరోగా సినిమాల్లో యాక్ట్ చేయాలని సలహా ఇచ్చానన్నారు రోజా. మేం అనుకున్నవిధంగా సుధీర్ హీరోగా ఎదుగుతున్నాడన్నారు. ఇప్పటివరకు టీవీ షోల్లో మాత్రమే సుడిగాలి సుధీర్ ను చూశారన్నారు. ఇకపై లవర్ బాయ్‌గా కమర్షియల్ లవ్ స్టోరీతో వస్తున్నాడన్నారు. సుధీర్‌తో పాటు సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నానన్నారు రోజా.

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...