రోజా నటించిన ఆ సంచలన చిత్రం ఏప్రిల్ 27తో 25 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు ఆ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది వివరాల్లోకి వెళితే.. 'యమలీల' వంటి గోల్డెన్ జూబిలీ హిట్ తర్వాత మనీషా ఫిలిమ్స్ బ్యానర్ లో కిషోర్ రాఠీ సమర్పణలో ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె అచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఘటోత్కచుడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఘటోత్కచుడు గా సత్యనారాయణ అద్భుత నటన కనబరిచారు. 'యమలీల' తర్వాత అలికి హీరోగా మంచి క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. అలాగే టాప్ హీరోయిన్ రోజా క్యారక్టర్ అందరినీ అలరించింది. రోబోట్ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు చిన్న పిల్లలను బాగా ఎంటర్‌టైన్ చేశాయి.
‘ఘటోత్కచుడు' కి చిన్నపాప కి మధ్య హార్ట్ టచింగ్ సెంటిమెంట్ అందరినీ కదిలించింది. అన్నింటికీ మించి ఈ సినిమాలో నాగార్జున చేసిన స్పెషల్ సాంగ్ ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇక ఈ సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్రం సన్నివేశాలు ఈ సినిమాకి పెద్ద మల్టిస్టారర్ లుక్ తీసుకొచ్చాయి. కర్ణుడిగా యాంగ్రీ హీరో రాజశేఖర్, కృష్ణుడిగా చక్రపాణి, అర్జునుడిగా శ్రీకాంత్ నటించడం ప్రేక్షకులకు గొప్ప థ్రిల్‌కు గురిచేసాయి.కోట శ్రీనివాస రావు ఈ సినిమాలో మాంత్రికుడి పాత్రలో నటించారు.అంతేకాదు ఈ చిత్రంలో మల్లిఖార్జున రావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి కామెడీ ప్రేక్షకులను కితకితలు పెట్టాయి. ఈ చిత్రంలో విలన్‌గా చలపతి రావు, శివాజీ రాజా నటించారు.
కృష్ణారెడ్డి గారు ఈ సినిమా కోసం చేసిన 'జ జ జ్జ రోజా...,' 'అందాల అపరంజి బొమ్మ..,' 'ప్రియమధురం..', 'భమ్ భమ్ భమ్..,' 'భామరో నన్నే ప్యార్ కారో...,' 'డింగు డింగు...' పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలియజేసారు.ఈ 25 ఇయర్స్ గా టివి లో వచ్చిన ప్రతిసారీ కొన్ని వందలమంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ ఉండడం చాలా థ్రిల్ కలిగించిందని చెప్పుకొచ్చారు.
'ఘటోత్కచుడు' కోసం పగలురాత్రి కృషి చేసిన టీం మెంబర్స్‌కు, ఈ ఘనవిజయానికి తోడ్పడిన ప్రేక్షకులకు,డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్ కి,అందరికీ మించి మీడియా ఫ్రెండ్స్ కి స్పెషల్ థాంక్స్ అన్నారు.ఈ సినిమా అప్పట్లో బంపర్ హిట్‌గా నిలిచింది.అంతేకాదు ఈ చిత్రం ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక ఈ సినిమాలో గెస్ట్ పాత్రల్లో నటించిన నాగార్జునతో ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి ‘వజ్రం’ సినిమాను తెరకెక్కించారు. ఇక రాజశేఖర్ తో ‘దీర్ఘసుమంగళి భవ’ సినిమాను నిర్మిస్తే.. ఇక శ్రీకాంత్‌తో వినోదం, ఆహ్వానం, ఎగిరే పావురమా వంటి పలు హిట్ చిత్రాలను డైరెక్ట్ చేసారు ఎస్వీ కృష్ణారెడ్డి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, MLA Roja, Nagarjuna Akkineni, Rajasekhar, Srikanth, Tollywood