వినాయక సమేత నందమూరి నాయకా... ఎన్టీఆర్ లుక్ అదుర్స్..

ఎన్టీఆర్ వినాయ‌క‌చ‌వితి కానుక ఇచ్చాడు. పండ‌గ వ‌చ్చిందంటే క‌చ్చితంగా హీరోలంతా త‌మ కొత్త సినిమాల లుక్స్ విడుద‌ల చేస్తార‌ని తెలుసు. ఇప్ప‌టికే నాని, నాగార్జున‌ "దేవ‌దాస్"తో వ‌చ్చారు. ఇప్పుడు నంద‌మూరి అభిమానులకు ఎన్టీఆర్ కూడా గిఫ్ట్ ఇచ్చేసాడు.

news18-telugu
Updated: September 12, 2018, 6:20 PM IST
వినాయక సమేత నందమూరి నాయకా... ఎన్టీఆర్ లుక్ అదుర్స్..
అరవింద సమేత ఫస్ట్‌లుక్
  • Share this:
ఎన్టీఆర్ వినాయ‌క‌చ‌వితి కానుక ఇచ్చాడు. పండ‌గ వ‌చ్చిందంటే క‌చ్చితంగా హీరోలంతా త‌మ కొత్త సినిమాల లుక్స్ విడుద‌ల చేస్తార‌ని తెలుసు. ఇప్ప‌టికే నాని, నాగార్జున‌ "దేవ‌దాస్"తో వ‌చ్చారు. ఇప్పుడు నంద‌మూరి అభిమానులకు ఎన్టీఆర్ కూడా గిఫ్ట్ ఇచ్చేసాడు. ఈయ‌న న‌టిస్తున్న "అర‌వింద స‌మేత" ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తొలిసారి ష‌ర్ట్ లేకుండా సిక్స్‌ప్యాక్‌తో క‌నిపించిన నంద‌మూరి చిన్నోడు.. ఈ సారి మాత్రం కూల్ అండ్ క్యూట్‌‌గా న‌వ్వుతూ ద‌ర్శ‌న‌మిచ్చాడు.

 

వినాయక సమేత నందమూరి నాయకా.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. rocking new poster of aravinda sametha.. audio on september 20..
అరవింద సమేత ఫస్ట్ లుక్ ట్విట్టర్ ఫోటో


అభిమానులంతా ఇప్పుడు ఆస‌క్తిగా చూస్తున్నారు ఈ చిత్రం కోసం. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్ర షూట్ ఇప్ప‌టికే చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. హ‌రికృష్ణ మ‌ర‌ణంతో మూడు రోజ‌లు మాత్ర‌మే బ్రేక్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్‌తో బిజీ బిజీ అయిపోయాడు. ఇప్పుడు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతుంది ఈ చిత్ర షూటింగ్.వినాయక సమేత నందమూరి నాయకా.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. rocking new poster of aravinda sametha.. audio on september 20..
‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్ పోస్టర్


సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఈ చిత్ర టాకీ పూర్తిచేసి.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ వీలైనంత త్వ‌ర‌గా ముగించి అక్టోబ‌ర్ 10న సినిమా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. సెప్టెంబ‌ర్ 20న "అర‌వింద స‌మేత" ఆడియో విడుదల కానుంది. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్టీఆర్‌తో "బృందావ‌నం".. "రామ‌య్యా వ‌స్తావ‌య్య‌".. "ర‌భ‌స" లాంటి సినిమాల‌కు క‌లిసి పని చేసాడు థ‌మ‌న్.

వినాయక సమేత నందమూరి నాయకా.. ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. rocking new poster of aravinda sametha.. audio on september 20..
ఎన్టీఆర్, త్రివిక్రమ్ (ఫేస్‌బుక్ ఫోటో)
Loading...
ఇప్పుడు మ‌రోసారి త‌న స‌త్తా చూపించాల‌ని చూస్తున్నాడు. పైగా త్రివిక్ర‌మ్‌తో ప‌ని చేయ‌డం ఈయ‌న‌కు ఇదే తొలిసారి. పూజాహెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. మొత్తానికి క‌త్తి ప‌ట్టుకుని వ‌చ్చిన లుక్ కంటే ఇప్పుడు క్యూట్‌గా ఉన్న లుక్‌కు ఫ్యాన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ వ‌స్తుంది.
First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...