హోమ్ /వార్తలు /సినిమా /

Robo Shankar: చిక్కుల్లో నటుడు రోబో శంకర్.. అనుమతి లేకుండా ఆ జాతి పక్షులను పెంచినందుకు అటవీ శాఖ దాడి..

Robo Shankar: చిక్కుల్లో నటుడు రోబో శంకర్.. అనుమతి లేకుండా ఆ జాతి పక్షులను పెంచినందుకు అటవీ శాఖ దాడి..

చిక్కుల్లో రోబో శంకర్ (Twitter/Photo)

చిక్కుల్లో రోబో శంకర్ (Twitter/Photo)

Robo Shankar: చిక్కుల్లో నటుడు రోబో శంకర్.. అటవి శాఖ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ జాతికి చెందిన చిలుకలను పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు నటుడు రోబో శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ తరలించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Robo Shankar: చిక్కుల్లో నటుడు రోబో శంకర్.. అటవి శాఖ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ జాతికి చెందిన చిలుకలను పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు నటుడు రోబో శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ తరలించారు. ఈ అరుదైన జాతి పక్షులు షెడ్యూల్ II  వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఎవరైనా అటవి శాఖ అనుమతులు తీసుకుంటే కానీ పెంచేందకు వీలు లేదు. అనుమతి లేకుండా అలెగ్జాండ్రైన్ జాతికి చెందిన చిలుకలను పెంచుతున్న నేరానికి నటుడికి అటవి శాఖ అధికారులు రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశాలున్నాయి. ఇక ఈ నటుడి ఇంట్లో ఈ చిలుకులు ఉన్న విషయం ఒక జంతు ప్రేమికుడి కారణంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్టాండప్ కమెడియన్‌ తనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో తన ఇంట్లో ఉన్న అరుదైన జాతి పక్షుల ప్రత్యేకతను వివరిస్తూ ఉన్న వీడియోను షేర్ చేసాడు. ఈ సందర్భంగా రోబో శంకర్ కుటుంబ సభ్యులు బోనులో ఉన్న చిలుకలకు ఎలా ఆహారాన్ని అందిస్తున్నారనేది ఇందులో చూపెట్టారు. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అతని ఇంటిపై అటవి శాఖ అధికారులు దాడి చేసి ఆ రెండు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు సదరు రోబో శంకర్‌తో పాటు ఇంటి వాళ్లపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా అటవి శాఖ అధికారులు ఆ చిలుకల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి వాటిని అటవిలో ఒదలేయాలా.. లేకపోతే జూ లోనే ఉంచాలనే విషయం పరిశీలిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ కేసులో జైలు శిక్ష లేకున్నా.. రూ. 5 లక్షల వరకు జరిమాన విధించే అవకాశాలున్నాయని అటవి శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

రోబో శంకర్ విషయానికొస్తే.. 'కలక్కపోవుత్ ఎవరు' షోతో పాపులర్ అయ్యారు.  ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్‌గా అరంగేట్రం చేశాడు. మారి, బేలన్ను వందట్ట వెలికాకారన్, కలకలప్పు 2 సహా పలు సినిమాల్లో రోబో శంకర్ కామెడీకి అభిమానులను దాసోహం అన్నారు. అక్కడ నుంచి నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు.  స్మాల్ స్క్రీన్ నుంచి వెండితెరకు వెళ్లి సక్సెస్‌లు అందుకున్న వారి లిస్ట్‌లో రోబో శంకర్ పేరు తప్పకుండా ఉంటుంది. ఆయన కూతురు ఇంద్రజ బిగిల్‌లో పాండియమ్మ పాత్రను పోషించింది.

First published:

Tags: Kollywood, Tamil Cinema

ఉత్తమ కథలు