చిరంజీవి.. బాలకృష్ణ.. మోహ‌న్ బాబు.. ఏంటీ వరస దొంగ‌త‌నాలు..

ఏదో ఓ విష‌యంలో ఎప్పుడూ సినిమా వాళ్లు హైలైట్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా సినిమా వాళ్ల ఇళ్ల‌లో వ‌ర‌స దొంగ‌త‌నాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌మ్మ‌కంగా ఉన్న మ‌నుషులే ఇలా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుండ‌టంతో వాళ్ల‌కేం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఇదే సీన్ రిపీట్ అయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 23, 2019, 1:42 PM IST
చిరంజీవి.. బాలకృష్ణ.. మోహ‌న్ బాబు.. ఏంటీ వరస దొంగ‌త‌నాలు..
చిరంజీవి బాలయ్య మోహన్ బాబు
  • Share this:
ఏదో ఓ విష‌యంలో ఎప్పుడూ సినిమా వాళ్లు హైలైట్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా సినిమా వాళ్ల ఇళ్ల‌లో వ‌ర‌స దొంగ‌త‌నాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌మ్మ‌కంగా ఉన్న మ‌నుషులే ఇలా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుండ‌టంతో వాళ్ల‌కేం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని తెలుసుకొని మోహన్ బాబు ఖంగు తిన్నారు. డబ్బుతో పాటు కొన్ని బంగారు ఆభరణాలు కూడా చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు.

Robbory in Mohan Babu House and previously done in Chiranjeevi, Balakrishna house also pk.. ఏదో ఓ విష‌యంలో ఎప్పుడూ సినిమా వాళ్లు హైలైట్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా సినిమా వాళ్ల ఇళ్ల‌లో వ‌ర‌స దొంగ‌త‌నాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌మ్మ‌కంగా ఉన్న మ‌నుషులే ఇలా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుండ‌టంతో వాళ్ల‌కేం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. mohan babu robbory,mohan babu robbory house,chiranjeevi house robbory,nagarjuna house robbory,police mohan babu robbory,robbory in cinema stars house,telugu cinema,మోహన్ బాబు ఇంట్లో దొంగతనం,మోహన్ బాబు ఇంట్లో చోరీ,చిరంజీవి ఇంట్లో దొంగతనం,నాగార్జున ఇంట్లో మహిళ భీభత్సం,బాలకృష్ణ గుర్రం దొంగతనం,తెలుగు సినిమా
మోహన్ బాబు

ఈ విషయంపై మోహన్ బాబు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి బయలుదేరారు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తులతో పాటు ప‌ని మనుషులను కూడా ఆరా తీస్తున్నారు. కచ్చితంగా తెలిసిన వ్యక్తులు ఈ దొంగతనం చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. కొత్త వ్యక్తులకు ఇంటి లోపలికి వచ్చే అవకాశమే లేదని.. అందుకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఈ దొంగతనం చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. అందరినీ విచారించిన తర్వాత అసలేం జరిగిందనేది చెబుతామంటున్నారు పోలీసులు.

Robbory in Mohan Babu House and previously done in Chiranjeevi, Balakrishna house also pk.. ఏదో ఓ విష‌యంలో ఎప్పుడూ సినిమా వాళ్లు హైలైట్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా సినిమా వాళ్ల ఇళ్ల‌లో వ‌ర‌స దొంగ‌త‌నాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. న‌మ్మ‌కంగా ఉన్న మ‌నుషులే ఇలా దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతుండ‌టంతో వాళ్ల‌కేం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఇదే సీన్ రిపీట్ అయింది. mohan babu robbory,mohan babu robbory house,chiranjeevi house robbory,nagarjuna house robbory,police mohan babu robbory,robbory in cinema stars house,telugu cinema,మోహన్ బాబు ఇంట్లో దొంగతనం,మోహన్ బాబు ఇంట్లో చోరీ,చిరంజీవి ఇంట్లో దొంగతనం,నాగార్జున ఇంట్లో మహిళ భీభత్సం,బాలకృష్ణ గుర్రం దొంగతనం,తెలుగు సినిమా
బాలకృష్ణ, నాగార్జున

ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం లక్షల విలువైన బంగారం.. మరికొంత నగదు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఇక స‌రిగ్గా రెండేళ్ల కింద చిరంజీవి ఇంట్లో కూడా ఇలాగే 2 ల‌క్ష‌లు చోరి అయింది. దానికి ముందు కూడా మోహ‌న్ బాబు ఇంట్లో ఓ సారి దొంగ‌త‌నం జ‌రిగింది. అప్ప‌ట్లో బాల‌కృష్ణ ఇంట్లో కూడా దొంగ‌తనం జ‌రిగింది. రెండేళ్ల కింద ఆయ‌న ఇంట్లో చొర‌బ‌డి గుర్రాన్ని దోచుకుని వెళ్లారు దొంగ‌లు. ఆ త‌ర్వాత దొరికారు కూడా. గ‌తేడాది నాగార్జున ఇంట్లో కూడా విజ‌య అనే మ‌హిళ ఇలాంటి హంగామా క్రియేట్ చేసింది. మొత్తానికి సినిమా వాళ్ల ఇళ్ల‌లో ఇప్పుడు దొంగ‌త‌నాలు కామ‌న్ అయిపోతున్నాయి.
First published: February 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading