Roar Of RRR : అదిరిన ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో.. విడుదల తేదిపై మరోసారి స్పష్టత..

Roar Of RRR RRR Making Photo : Twitter

Roar Of RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఓ సారి ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఓ ఎనిమిది నెలలు వాయిదా పడగా.. ఆ తర్వాత ప్రభుత్వ అనుమతులతో కొంత కాలం షూటింగ్ చేశారు. ఇక మరోసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈరోజు ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో విడుదల చేశారు. అందులో సినిమాను ఎలా తెరకెక్కించారు.. యాక్షన్ సీన్స్‌ను ఓ రేంజ్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఏమాత్రం అంచనాలు తగ్గకుండా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఈ మేకింగ్ వీడియోను చూస్తే తెలుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు ఇతర నటులు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల విజువల్స్‌ను చూపించారు.. ఇక ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని మరోసారి చిత్రబృందం ప్రకటించింది.

    ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తో పాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ ఇంకా డిజిటల్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

    ఈ పెన్ స్టూడియోస్ ప్రస్తుతం తెలుగులో మాస్ మహారాజ్ రవితేజతో లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడి” సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకుడు. పెన్ మూవీస్ తెలుగు చత్రపతిని హిందీలో బెల్లంకొండ హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వి వి వినాయక్ దర్శకుడు. ఈ సినిమాతో పాటు అపరిచితుడు సినిమాను కూడా పెన్ మూవీస్ హిందీలో రీమేక్ చేస్తోంది. శంకర్ దర్శకుడు. రణ్ వీర్ సింగ్ హీరోగా చేస్తున్నారు.

    ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌, శ్రియా శరన్‌, ఆలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్‌, సముద్రఖని కనిపిపంచనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
    Published by:Suresh Rachamalla
    First published: