హోమ్ /వార్తలు /సినిమా /

BIgg Boss 5 Telugu RJ Kajal: నీకు వంట చెయ్యడం రాదా.. ఆర్జే కాజల్‌కు చుక్కలు చూపించిన నాగార్జున.. దొరికిపోయా అంటూ?

BIgg Boss 5 Telugu RJ Kajal: నీకు వంట చెయ్యడం రాదా.. ఆర్జే కాజల్‌కు చుక్కలు చూపించిన నాగార్జున.. దొరికిపోయా అంటూ?

ఎందుకంటే అన్నీ అవపోసన పట్టిన తర్వాతే అమ్మాయిగారు ఇంట్లోకి అడుగు పెట్టారు కాబట్టి. అయితే ఇంట్లో ఉన్నపుడు బిగ్ బాస్ సీరియస్ అయితే ఓ అర్థం ఉంటుంది కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కాజల్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈమె చేసిన ఓ పనికి స్టార్ మా యాజమాన్యం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే అన్నీ అవపోసన పట్టిన తర్వాతే అమ్మాయిగారు ఇంట్లోకి అడుగు పెట్టారు కాబట్టి. అయితే ఇంట్లో ఉన్నపుడు బిగ్ బాస్ సీరియస్ అయితే ఓ అర్థం ఉంటుంది కానీ బయటికి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కాజల్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఈమె చేసిన ఓ పనికి స్టార్ మా యాజమాన్యం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

BIgg Boss 5 Telugu RJ Kajal: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై వారం కావస్తుంది. ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా.. మొత్తానికి ఈ వారంలో 19 మంది కంటెస్టెంట్ లా మధ్య పరిచయాలు బాగానే జరిగాయి. అంతేకాకుండా కొన్ని కాంట్రవర్సీలు కూడా నడిచాయి.

ఇంకా చదవండి ...

BIgg Boss 5 Telugu RJ Kajal: బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమై వారం కావస్తుంది. ఇందులో 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొనగా.. మొత్తానికి ఈ వారంలో 19 మంది కంటెస్టెంట్ లా మధ్య పరిచయాలు బాగానే జరిగాయి. అంతేకాకుండా కొన్ని కాంట్రవర్సీలు కూడా నడిచాయి. మధ్య మధ్యలో గొడవలు బాగా హైలెట్ గా నిలిచాయి. ఇక వారంలో చివరి రెండు రోజులలో నాగార్జున ఎంట్రీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కంటెస్టెంట్ ఆర్జే కాజల్ కు చుక్కలు చూపించాడు నాగార్జున.

నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి అందరిపై బాగానే కౌంటర్లు వేసాడు. ఇందులో కంటెస్టెంట్ ఆర్జే కాజల్ అబద్ధాలు చెప్పినట్లు కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాను వంట గదిలో పని చేయడం ఇష్ట పడుతుందో లేదో తెలియదు కానీ.. బిగ్ బాస్ హౌస్ లో నాకు వంట రాదు అంటూ.. చేయను అంటూ.. అంట్లు తోమాను అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు కూడా కాస్త ఫైర్ అయ్యారు.

ఇది కూడా చదవండి:నాగార్జున ప్రశ్న.. పబ్లిక్‌గా గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పేసిన షన్ను.. దీప్తినే అంటూ?

దీంతో తనకు వంటలు రావని అనడంతో నెట్టింట్లో ఆమె వంటలు చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. గతంలో ఆమె వంటలు చేసిన వీడియోలు ప్రస్తుతం బయటకు రావడంతో.. వంటలు రావని వంట వీడియోలు చూసి ఎలా పెట్టింది అంటూ బాగా ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగార్జున ఈ విషయం గురించి నిన్నటి ఎపిసోడ్ లో కాజల్ లో చర్చించాడు.కాజల్ నీకు వంట రాదా అని ప్రశ్నించగా.. అంటే ప్రూవ్ చేసుకునే విధంగా ఉండదు అని తెలిపింది.

ఇది కూడా చదవండి:డైరెక్ట్‌గా షోలోనే అక్కడికి వెళ్దాం అని అడిగేసిన సరయు.. నాగార్జున కూడా?

దీంతో వెంటనే నాగార్జున నీకు వంటలు రావని తెలిసి నీ ఇన్ స్టా లో చూసాం.. అందులో నువ్వు వంట చేసిన వీడియోలు చాలానే ఉన్నాయని కాజల్ అసలు రూపం బయటపెట్టడంతో వెంటనే కాజల్ నాలుక కొరుక్కుంది. దీంతో నాగార్జున కాజల్ కు వంట వచ్చు దొంగ అని అనడంతో.. వెంటనే కాజల్ అవి యూట్యూబ్ లో చూసి లాక్ డౌన్ లో చేసిన వంటలు అని తెలిపింది. అవి చూసి దింపడం తప్పా సొంతంగా వంటలు చేయడం రావు అంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇక నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్లని చూసి వంట నేర్చుకో అంటూ సలహా ఇచ్చాడు.

First published:

Tags: Akkineni nagarjuna, Bigg Boss 5 Telugu, Rj kajal, Sreerama chandra, Star Maa

ఉత్తమ కథలు