RizaBawa : చిత్ర సీమలో మరో విషాదం.. ప్రముఖ మలయాళ నటుడు కన్నుమూత రిజబావా (RizaBawa) అనారోగ్యంతో కన్నుమూసారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్నేళ్లుగా చిత్ర సీమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యేడాది తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమ అనే తేడా లేకండా భారతీయ చిత్ర పరిశ్రమలో అన్ని ఇండస్ట్రీస్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు కరోనాతో చాలా మంది దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు కన్నుమూసారు. ఇప్పటికే తమిళ కమెడియన్ వివేక్.. ఆ తర్వాత సీనియర్ నటుడు పొట్టి వీరయ్య.. దర్శకుడు సాయి బాలాజీ, దర్శకుడు కేవి ఆనంద్ వంటి వారు కన్నుమూసారు.
అటు బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌తో పాటు అలనాటి కథానాయికగా జయంతి, ఆనంద్ కణ్ణన్‌తో, హాలీవుడ్ నటుడు మైఖేల్ విలియమ్‌తో పాటు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియాతో పాటు నిన్నటి నిన్న ప్రముఖ నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి కూడా అనారోగ్యంతో కన్నుమూసారు. తాజాగా మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిజబావా కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూసారు.
ఈయన గత కొన్ని రోజులుగా కిడ్నీకి సంబంధించిన ట్రీట్మెంట్ను కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకుంటున్నారు. ఈ కోవలో కిడ్నీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఈయన సోమవారం కన్నుమూసారు. కాగా 90వ దశకంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. రిజబావా మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
1990లో షాజీ కైలాస్ డైరెక్షన్లో తెరకెక్కించిన ‘డాక్టర్ పశుపతి’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఈయన ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా కూడా సత్తా చాటారు. ముఖ్యంగా ‘ఇన్ హరిహర్ నగర్’లో ఈయన చేసిన పాత్ర ఈయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో జాన్ హునె క్యారెక్టర్ ఈయనకు మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చింది.
దాదాపు 150కి పైగా మలయాళ చిత్రాల్లో పలు పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఈయన వెండితెరపై పాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించి అక్కడ సత్తా చాటారు. ఈయన చివరగా మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన ‘వన్’ చిత్రంలో యాక్ట్ చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.