భారీ రెమ్యునరేషన్ ఆ ముగ్గురి హీరోయిన్లకే.. అంటున్న ప్రియమణి

ఆ మగ్గురు మాత్రమే... వాళ్లకి గల డిమాండ్ ను బట్టి తమకి ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని నిర్మాతల నుంచి రాబట్టగలుగుతున్నారు.

news18-telugu
Updated: October 12, 2019, 2:30 PM IST
భారీ రెమ్యునరేషన్ ఆ ముగ్గురి హీరోయిన్లకే.. అంటున్న ప్రియమణి
ప్రియమణి
news18-telugu
Updated: October 12, 2019, 2:30 PM IST
ప్రియమణి... తెలుగు తమిళ సిినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్.
ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయిన ఈ హాట్ భామ వెబ్ సిరీస్ లతో బిజీగా మారింది. అయతే హీరోయిన్స్ కి ఇస్తున్న పారితోషికాల సంబంధించి అడిగిన ప్రశ్నలకు ఆమె ఆసక్తికర సమాధానాం చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణికి "తమ టాలెంట్ కి తగిన పారితోషికం దక్కడం లేదని చాలామంది హీరోయిన్స్ అసహనాన్ని .. అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరేమంటారు?" అనే ప్రశ్న అడిగారు. దీనిపై ప్రియమణి ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చింది.

" బాలీవుడ్ విషయం పక్కన పెడితే... సౌత్‌లో మాత్రం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసే పరిస్థితి నయనతార .. అనుష్క .. సమంతలకు మాత్రమే వుందని చెప్పుకొచ్చిందీ సెక్సీ భామ. వాళ్లకి గల డిమాండ్ ను బట్టి తమకి ఇంత పారితోషికం ఇస్తేనే చేస్తామని చెప్పి ఆ మొత్తాన్ని నిర్మాతల నుంచి రాబట్టగలుగుతున్నారు. మిగతా హీరోయిన్స్ కి అలా డిమాండ్ చేసే అవకాశం లేదు" అని ఆమె చెప్పుకొచ్చారు.First published: October 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...