జెనీలియా భర్తకు ఝలక్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బందితో ఇబ్బంది..

రితేష్ దేశ్‌ముఖ్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ జెనీలియా డిసౌజా భ‌ర్త అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఈ బాలీవుడ్ హీరో ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఎయిర్ పోర్టులో దిగీ దిగ‌గానే ఇక్క‌డ ఏర్పాట్ల‌పై సెటైర్లు వేసాడు రితేష్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2019, 2:47 PM IST
జెనీలియా భర్తకు ఝలక్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బందితో ఇబ్బంది..
జెనిలియా ట్విట్టర్ ఫోటో
  • Share this:
రితేష్ దేశ్‌ముఖ్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు కానీ జెనీలియా డిసౌజా భ‌ర్త అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఈ బాలీవుడ్ హీరో ఇప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చాడు. ఎయిర్ పోర్టులో దిగీ దిగ‌గానే ఇక్క‌డ ఏర్పాట్ల‌పై త‌న ట్విట్ట‌ర్లో కొన్ని వివాదాస్ప‌ద‌మైన పోస్టులు పెట్టాడు. మ‌నం ఇప్పుడు హైద‌రాబాద్ ఎయిర్ పోర్టులో ఉన్నాం.. ఇక్క‌డ దిగ‌గానే ప‌వ‌ర్ పోయింది.. ఎలివేట‌ర్ ప‌ని చేయ‌డం లేదు.. బ‌య‌టికి వెళ్ల‌డానికి ఉన్న ఒకే ఒక్క ఎగ్జిట్ డోర్ కూడా చైన్‌తో లాక్ చేసారు.. ఇలా అయితే ఎలా అంటూ ఎయిర్ పోర్టు సిబ్బందిపై సెటైర్లు వేసాడు.


ఇలా అయితే ప్ర‌యాణికులు ఎంత ఇబ్బంది ప‌డ‌తారు..? క‌నీసం అది కూడా ఆలోచించ‌రా.. ఇక్క‌డే ఇరుక్కుపోతే వెళ్లాల్సిన ఫ్లైట్ మిస్ అయితే ఎవ‌రికి బాధ్య‌త అంటూ కాస్త ఘాటుగానే ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌పై ట్వీట్ చేసాడు రితేష్. హ‌లో హైద‌రాబాద్ ఇప్ప‌టికైనా మేల్కోండి అంటూ సెటైర్ వేసాడు ఈ హీరో. దాంతో వెంట‌నే ఎయిర్ పోర్ట్ సిబ్బంది కూడా రితేష్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.



హ‌లో రితేష్.. మీ విలువైన స‌మాచారానికి కృత‌జ్ఞ‌త‌లు.. అయితే మీరు గ‌మ‌నించాల్సిన విష‌యం ఒక్క‌టి ఉంది.. ఆ డోర్ లాక్ ప‌క్క‌నే ఉన్న బాక్సులో ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని బ‌య‌టికి వెళ్లిపోవ‌చ్చు.. అది కూడా గ‌మనించి ఉంటే బాగుండేది అంటూ ఆన్స‌ర్ ఇచ్చింది ఎయిర్ పోర్ట్ సిబ్బంది.



దాంతో వెంట‌నే రితేష్ అడిగిన ప్ర‌తీ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన‌ట్లైంది. ఏదేమైనా హైద‌రాబాద్ ఎయిర్ పోర్ట్ గురించి అలుసుగా మాట్లాడిన జెనీలియా భ‌ర్త‌కు వెంట‌నే స‌రైన స‌మాధానం ఇచ్చి టిట్ ఫ‌ర్ ట్యాట్ ఇచ్చింది సిబ్బంది. దాంతో రితేష్ దేశ్‌ముఖ్ కూడా సైలెంట్ అయిపోయాడు.
Published by: Praveen Kumar Vadla
First published: May 28, 2019, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading