హోమ్ /వార్తలు /సినిమా /

Rising India 2023 | Manoj Bajpayee : ది ఫ్యామిలీ మ్యాన్ 3 రిలీజ్‌‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మనోజ్ బాజ్‌పేయి..

Rising India 2023 | Manoj Bajpayee : ది ఫ్యామిలీ మ్యాన్ 3 రిలీజ్‌‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మనోజ్ బాజ్‌పేయి..

Manoj Bajpayee in Rising India 2023

Manoj Bajpayee in Rising India 2023

Rising India 2023 | Manoj Bajpayee : మనోజ్ బాజ్‌పేయి గురించి ప్రత్యేకించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. ఇక అది అలా ఉంటే ఆయన తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 3కి సంబంధించిన అప్‌డేట్‌ను రైజింగ్ ఇండియా ఈవెంట్‌లో పంచుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) గురించి ప్రత్యేకించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన అడపా దడపా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ సత్య (Satya) నుంచి ఆ మధ్య అల్లు అర్జున్ వేదం వరకు పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక ముఖ్యంగా మనోజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌(Family Man web series)తో దేశవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు. ఇక అది అలా ఉంటే ఆయన తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 3కి (The Family Man 3 ) సంబంధించిన అప్‌డేట్‌ను రైజింగ్ ఇండియా అనే ఈవెంట్‌లో పంచుకున్నారు. మనోజ్ బాజ్‌పేయ్.. తాను చేసిన విభిన్న పాత్రల ద్వారా సంవత్సరాలుగా తెలుగుతో పాటు ముఖ్యంగా హిందీలో నటనా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌(Gangs of Wasseypur)లోని ఓ గ్యాంగ్‌స్టర్ ఆయన నటన వావ్ అనిపిస్తుంది. ఇక లేటెస్ట్‌గా మనోజ్.. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో ఓవైపు దేశ రక్షణకు సంబంధించిన పనుల్లో అదరగొడుతూనే.. కుటుంబానికి అండగా ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ.. రెండు రోల్స్‌లో కేక పెట్టించాడు. ఈ భారతదేశంలో అత్యంత ఇష్టపడే షోలలో ఒకటిగా మారింది. ఇప్పుడు ఈ నటుడు రాజ్ అండ్ డికె దర్శకత్వంలో వస్తున్న మూడవ సీజన్‌లో కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ మూడో సీజన్ కోసం అతని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మనోజ్ బాజ్‌పేయి న్యూస్18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడుతూ.. తన ఫ్యామిలీ మ్యాన్ 3 షో గురించిన అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈవెంట్‌లో ది ఫ్యామిలీ మ్యాన్ 3 గురించి అడిగినప్పుడు.. ఈ సంవత్సరం చివరి నాటికి సిరీస్ ప్రారంభమవుతుందని అన్నారు. అతను హిందీలో ఇలా అన్నాడు, “అజ్ హీ శుభా ఏక్ చిదియా ఉర్తే హుయే మేరే ఖిడ్కీ పే బైతి ఔర్ ఉస్నే కహా, షాయద్ షూటింగ్ సాల్ కే అంత్ మే కర్ సక్తే హై హమ్‌లోగ్. ఔర్ అగర్ పైసే బచ్నే కే బాద్ సబ్ సాహి హో గయీ, తో షాయద్ కర్ హీ లేంగే."

News18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో, మనోజ్ బాజ్‌పేయి హిందీలో ఒక పద్యం కూడా చెప్పారు. ఇప్పటికీ దర్శకులకు ఫోన్ చేసి పని అడుగుతానని తెలిపాడు మనోజ్. ఇక అతని దినచర్య ఎలా ఉంటుందో అడిగినప్పుడు, అతను ఉదయం 5 గంటలకు నిద్రలేచి ధ్యానం చేస్తాడట, దాని తర్వాత రన్నింగ్.. ఆ తర్వాత ప్రార్థనలు చేస్తానని చెప్పాడు. ఇన్నేళ్ల తర్వాత కూడా సినిమావాళ్లను పని అడుగుతారా అని ప్రశ్నించిన్నప్పుడు.. తాను పని కోసం ఈ నగరానికి (ముంబై) వచ్చానని, అలా చేయడం ఎప్పుడూ ఆపకూడదని తెలిపాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్‌తో పాటు మనోజ్ బాజ్‌పేయి డెస్పాచ్ ఇంకా జోరామ్‌లలో కూడా నటిస్తున్నారు.

First published:

Tags: Manoj bajpayee, Tollywood news