మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur ).. అంటే తెలియకపోవచ్చు.. కానీ సీతా రామం హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు తెలుగు ఆడియెన్స్. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం 2022 ఆగస్టు 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అది అలా ఉంటే మృణాల్ ఠాకూర్ మార్చి 30, గురువారం న్యూ ఢిల్లీలో జరిగిన న్యూస్18 రైజింగ్ ఇండియా (Rising India 2023) సమ్మిట్‌కు హాజరయ్యారు. ఈ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. తాను నటి కావాలని నిర్ణయించుకున్న సమయంలో, తన కుటుంబం మొదట్లో మద్దతు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆమె పేర్కోన్నారు.
తన కెరీర్‌లో మొదట్లో హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయం ఎలా ఉండేదని ప్రశ్నకు స్పందిస్తూ.. “ నేను నా కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మొదట్లో నాకు వారి మద్దతు పెద్దగా లేదు. ఎందుకంటే వారికి ఈ ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు.. నాకు ఏమి జరుగుతుందో అని వారు భయపడ్డారు, నాకు మంచి పాత్రలు వస్తాయో లేదో అని సందేహం ఉండేది. కానీ నేను టెలివిజన్‌తో నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు తోటినటులతో మంచి అనుబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత నా సినీ కేరీర్‌ను ఎంజాయ్ చేశాను. టీవీ షోల్లో నటిస్తూ ఆ తర్వాత మరాఠీ సినిమాలో నటించి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “మాదీ మరాఠి ఫ్యామిలీ కాబట్టి, షూటింగ్ జరుగుతున్నప్పుడు నా కుటుంబ సభ్యులు, నా సినిమా టీమ్‌తో మాట్లాడుతూ.. నేను చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుని చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. అలా నేను నటించిన లవ్ సోనియా మూవీకి వారు ఎంతో గర్వించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఫిల్మ్ ఫెస్టివల్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నప్పుడు, అందరూ నన్ను 'మృణాల్.. నువ్వు మరో స్మితా పాటిల్ అనే వారు. నాకు స్మితా పాటిల్ అంటే దైవంతో సమానం. నేను ఆమెను ఎంతో ఆరాధిస్తాను. ఆమె చేసిన చిత్రాలన్నింటినీ ఎంతో జాగ్రత్తగా అధ్యయనం చేసాను. నన్ను స్మిత పాటిల్‌తో పోల్చడం అంటే ఓ మరాఠీ అమ్మాయికి ఇది చాలా పెద్ద అభినందన అన్నట్లే.. ఇక ప్రస్తుతం నా ఎదుగుదలను చూసిన నా ఫ్యామిలీ.. 'మృణాల్, మేము నిన్ను చూసి గర్విస్తున్నాము. ఇక నువ్వు వెనుదిరిగి చూసే పరిస్థితి లేదు. ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకో.. నవ్వు ఏ చిత్రంలో నటించినా.. ప్రేక్షకులు దాని నుండి ఏదైనా నేర్చుకునేలా చూసుకో అని అన్నారు.. సినిమా చూసిన నీ గురించే మాట్లాడాలన్నారు. ఈ సందర్భంగా ఒక నటీగా ఈ సమాజం కోసం తన వంతుగా చేయాల్సిన ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు మృణాల్.
ఇక మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె వర్ధన్ కేత్కర్ దర్శకత్వంలో వస్తున్న గుమ్రాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల అవుతోంది. ఈ సినిమాలో మృణాల్‌తో పాటు ఆదిత్య రాయ్ కపూర్, రోనిత్ రాయ్, వేదికా పింటో, దీపక్ కల్రా , మోహిత్ ఆనంద్ తదితరులు నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mrunal Thakur, Tollywood news