Home /News /movies /

RISHI SHOWS LOVE ON VASUDHARA IN THE WAY OF FASTING IN TODAYS GUPPEDANTHA MANASU SERIAL EPISODE NR

Guppedantha Manasu: వసుధారాపై ప్రేమను అలా చూపించిన రిషీ.. అనుమానంలో మహీంద్రా!

Guppedantha Manasu

Guppedantha Manasu

Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా రేటింగ్ విషయంలో కూడా ఈ సీరియల్ బాగా దూసుకుపోతుంది.

    Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా రేటింగ్ విషయంలో కూడా ఈ సీరియల్ బాగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సీరియల్ ను యువత కూడా బాగా ఇష్టపడుతున్నారు. ఇక రిషి.. తన వల్లే వసుకి జ్వరం వచ్చిందని తలుచుకొని తెగ బాధ పడతాడు. అమ్మవారి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ వసు కోలుకోవాలని కోరుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లి తన వదినతో మంచి జరగాలంటే ఉపవాసం చేస్తారట కదా అని అనడంతో వెంటనే ఆమె కూడా అవును అనేసరికి రిషి ఉపవాసం ఉండాలని ఫిక్స్ అవుతాడు.

    ఇక తన వదిన అడిగేసరికి తన కోసమే అని అబద్ధం చెబుతాడు. వసు లేచి జ్యూస్ తాగుతున్నప్పుడు రిషి తన డాడ్ కి ఫోన్ చేసి వసు ఆరోగ్యం గురించి ఆరా తీస్తుంటాడు. అంతేకాకుండా వసు డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని గురించి కూడా మాట్లాడుతాడు. ఇక మహేంద్ర ఆ డబ్బు గురించి రిషికి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతాడు. ఇక తన కోసం రిషి పలకరించడానికి వచ్చి వెళ్ళాడని తెలుసుకుంటుంది వసు. రిషి సార్ తన కోసం వచ్చాడని షాక్ అవుతుంది. ఇక రిషి ఉపవాసం ఉన్న విషయం దేవయానికి తెలీదు. రిషి తినట్లేదు అని తన భర్తకు చెబుతుండగా.. సంజు వచ్చి రిషి ఉపవాసం ఉన్నాడని తెలుపుతుంది.

    ఇక అక్కడే ఉన్న ధరణి మాత్రం ఏం చెప్పలేక పోతుంది.రిషి జగతి ఇంటికి వెళ్లడం మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇదిలా ఉంటే తన కోసం రిషి వస్తున్నాడన్న సంతోషంలో వసు బయటకి వస్తూ సార్ అంటూ కింద పడబోతుంది. ఇక రిషి కంగారు పడగా జగతి వసు ని కూర్చో పెడుతుంది. ఇక రిషి, వసు లు జగతి ని ఉద్దేశించి మాట్లాడుకుంటారు. ఈ సీన్ బాగా ఆసక్తి గా ఉండటంతో.. ఇక జగతి వారి మాటలను విని ప్రేమలో పడ్డారేమో అని జగతికి అర్థమయ్యేలా అనిపిస్తుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Guppedantha manasu serial, Jagathi, Mahendra, Rishi, Vasudhara

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు