హోమ్ /వార్తలు /సినిమా /

Rishab Shetty: కన్నడ సినిమా షూటింగ్‌లో హీరోకి గాయాలు.. ఇంతకీ ఏమి జరిగిందంటే..

Rishab Shetty: కన్నడ సినిమా షూటింగ్‌లో హీరోకి గాయాలు.. ఇంతకీ ఏమి జరిగిందంటే..

Rishab Shetty Injured:  కన్నడ సినిమా షూటింగ్‌‌లో భాగంగా కొన్ని ఫైట్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా హీరో రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే..

    Rishab Shetty Injured:  కన్నడ సినిమా షూటింగ్‌‌లో భాగంగా కొన్ని ఫైట్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా హీరో రిషబ్ శెట్టికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తోన్న షూటింగ్‌లో పెట్రోల్ బాంబులు వేయాల్సిన సన్నివేశాలున్నాయి. స్క్రిప్ట్ ప్రకారం షూటింగ్‌లో ఫైట్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా హీరో రిషబ్‌తో పాటు మరో నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు విసిరి పారిపోవాల్సిన సన్నివేశాలను షూట్ చేయాలి. కానీ ఈ సన్నివేశంలో వారు పరిగెత్తే లోపే పెట్రో బాంబులు పేలాయి. దీంతో షూటింగ్‌లో హీరో ురిషబ్‌తో పాటు మరో నటుడు గాయాలపాలయ్యారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కర్ణాటక పోలీసులు సినిమా షూటింగ్ కోసం నిర్మాతలకు ఎవరు  పర్మిషన్స్ ఇచ్చారనే విషయమై ఆరా తీస్తున్నారు. మొత్తంగా ఈ పెట్రో బాంబు ఘటన కన్నడ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.హీరో రిషబ్ విషయానికొస్తే.. ఈయన కన్నడ చిత్ర సీమలో దర్శకుడి నుంచి హీరోగా మారాడు. అంతేకాదు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శాండిల్ వుడ్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 2013లో లూసియా సినిమాతో పరిచయమైన ఈయన చేతిలో ప్రస్తుతం అర డజను పైగా సినిమాలున్నాయి.

    First published:

    Tags: Kannada Cinema, Sandalwood

    ఉత్తమ కథలు