సూపర్ స్టార్ కృష్ణ (Super star Krishna) ఎలా చనిపోయారు? సెప్టెంబరులో కృష్ణ సతీమణి ఇందిరా దేవి మృతి చెందిన సమయంలో..ఆయన బాగానే కనిపించారు.మరి అంతలోనే ఏమైంది? ఇప్పుడివే ప్రశ్నలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై కాంటినెంటల్ డాక్టర్లు స్పష్టతనిచ్చారు. మొదట కార్డియక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారని.. ఆ తర్వాత అవయవాలన్నీ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల.. కృష్ణ (RIP Krishna) మరణించారని తెలిపారు. మనశ్శాంతిగా వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో.. చివరి క్షణాల్లో ఇబ్బంది వైద్య చికిత్సతో పెట్టలేదని వెల్లడించారు.
'' కృష్ణ నిన్న ఉదయం కార్డియక్ అరెస్ట్‌తో ఆస్పత్రికి వచ్చారు. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్స అందించాం. వచ్చినప్పటి పరిస్థితి విషమంగానే ఉంది. క్రమక్రమంగా అవయవాలన్నీ పనిచేయడం ఆగిపోయాయి. నాలుగు గంటల తర్వాత డయాలిసిస్ కూడా చేశాం. గంట గంటకూ కుటుంబ సభ్యలతో మాట్లాడాం. సాయంత్రం తర్వాత అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. బ్రెయిన్ డ్యామేజీ అయింది. రాత్రి 7 గంటల తర్వాత పరిస్థితి విషమించింది. చికిత్స కొనసాగించినా ఫలితం ఉండదని కుటుంబ సభ్యులకు వివరించాం. చివరి క్షణాల్లో ఆయనకు ఇబ్బంది కలగకూడదని, ఉన్న కొన్ని గంటలు మనశ్శాంతిగా వెళ్లిపోవాలని అనుకున్నాం. అందుకే తదుపరి చికిత్సను కొనసాగించలేదు. ఉదయం 04:09కి ఆయన తుది శ్వాస విడిచారు.'' అని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Superstar Krishna Garu expired in early hours of morning at 4:09 AM Today. Continental Hospitals Medical Report #RIPSuperStarKrishnaGaru pic.twitter.com/CjLlXRyTRN
— BA Raju's Team (@baraju_SuperHit) November 15, 2022
సూపర్ స్టార్ కృష్ణ రేర్ పిక్స్.. మీరు ఇప్పటి వరకూ చూడనివి..
ఇంట్లోనే స్పృహ తప్పారని తమకు తెలిసిందని కాంటినెంటల్ డాక్టర్లు తెలిపారు. ఐతే ఇంట్లో ఎంత సేపు అపస్మారక స్థితిలో ఉన్నారో తెలియదని.. ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఒక సెకన్ కూడా వృథా చేయకుండా ట్రీట్మెంట్ ఇచ్చామని పేర్కొన్నారు. సీపీఆర్ చేసి.. మళ్లీ 20 నిమిషాల్లోనే గుండె కొట్టుకునేలా చేశామని వెల్లడించారు.
కుమారుడు మహేష్ బాబుతో కృష్ణ ఎన్ని సినిమాల్లో కలిసి నటించారో తెలుసా..
కృష్ణ మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సంతాపం ప్రకటించారు. పలువురు ఆస్పత్రికి వెళ్లి మహేష్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. అభిమానులు కంటతడిపెట్టుకుంటున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది ఇది మూడో విషాదం. మొదట కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత ఆయన భార్య ఇందిరా దేవి, ఇప్పుడు కృష్ణ మరణించడంతో.. మహేష్ బాబు కుటుంబం శోక సంద్రంలో మునిగింది.
టాలీవుడ్ రియల్ ట్రెండ్ సెట్టర్ కృష్ణ..ఈయనకు మాత్రమే సాధ్యమైన ఈ 20 రికార్డులు తెలుసా..
కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసానికి తరలిస్తారు. సినీ ప్రముఖులంతా అక్కడికి వెళ్లి నివాళులు అర్పిస్తారు. ఐతే అంత్యక్రియలు ఎప్పుడు చేస్తారు? ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై కుటుంబ సభ్యులు కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Krishna, Super Star Krishna, Telangana, Tollywood