అభిమానుల ఓవర్ యాక్షన్.. ఏకంగా హీరోను ‘చంపేశారు’..

తమిళనాట విజయ్, అజిత్ ఇద్దరూ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎలా ఉన్నా.. వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం విపరీతమైన వైరం ఉంది.


Updated: July 30, 2019, 7:03 AM IST
అభిమానుల ఓవర్ యాక్షన్.. ఏకంగా హీరోను ‘చంపేశారు’..
విజయ్ (File)
  • Share this:
సినీ హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. అయితే, భయంకరమైన ఫ్యాన్స్ కూడా ఉంటారు. కొందరు హీరోలు బాగానే ఉన్నా.. వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మెగా, నందమూరి ఫ్యామిలీ అభిమానుల మధ్య ఇలాంటి యుద్ధం జరుగుతూ ఉండేది. ప్రస్తుతానికి అది కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. అయితే, తమిళనాడులో మాత్రం హీరోల ఫ్యాన్స్ మధ్య వైరం ఇంకా తగ్గలేదు. ప్రముఖ సోషల్ మీడియా సైట్ అయిన ట్విట్టర్‌లో ఈరోజు #RIPactorVIJAY అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. అంటే తమిళనాడులో పెద్ద హీరో అయిన విజయ్ చనిపోయాడంటూ ఆ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. కొందరు కావాలని ఈ హ్యాష్ ట్యాగ్‌ని క్రియేట్ చేస్తే.. మరికొందరు తెలియక దాన్ని రీ ట్వీట్ చేశారు. దీనిపై క్రికెట్ అశ్విన్ ట్వీట్ చేశాడు. దేశంలో ఎన్నో సమస్యలు ఉంటే, కొందరు యువత మాత్రం ఇలాంటి హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారంటూ విమర్శించాడు.


తమిళనాట విజయ్, అజిత్ ఇద్దరూ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎలా ఉన్నా.. వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం విపరీతమైన వైరం ఉంది. దీంతో అజిత్ ఫ్యాన్స్ కావాలనే ఇలా విజయ్ మీద హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది. చాలా మంది విజయ్ అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
#RIPactorVIJAY హ్యష్ ట్యాగ్ ట్రెండ్ కావడంతో వెంటనే విజయ్ ప్యాన్స్ కూడా అలర్ట్ అయ్యారు. వెంటనే #LongliveVijay అంటూ మరో హ్యాష్ ట్యాగ్‌ని క్రియేట్ చేసి దాన్ని ట్రెండ్ చేశారు.
First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>