Ranbir Kapoor : రణ్ బీర్, కరణ్‌కు కరోనా.. క్లారిటీ ఇచ్చిన రిద్ధిమా కపూర్..

Ranbir Kapoor : అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ యువ హీరో రణ్ బీర్ కపూర్‌కు కరోనా వచ్చిందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది.

news18-telugu
Updated: July 12, 2020, 8:39 AM IST
Ranbir Kapoor : రణ్ బీర్, కరణ్‌కు కరోనా.. క్లారిటీ ఇచ్చిన రిద్ధిమా కపూర్..
రణ్ బీర్ కపూర్, కరణ్ జోహార్ Photo : Twitter
  • Share this:
Amitabh Bachchan : బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్క సారిగా బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. బిగ్ బీ త్వరగా కోలుకోవాలనీ సామాన్యుల నుండి సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ఆ దేవున్నీ ప్రార్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ నటుడు రణ్ బీర్ కపూర్, నీతు కపూర్, ప్రముఖ హీందీ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ వైరస్ బారిన పడ్డారని పుకార్లు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు బచ్చన్ మనవడు అగస్త్య నంద కొన్ని రోజుల కింద నీతూ కపూర్ పుట్టినరోజు పార్టీకి వెళ్లాడని.. అక్కడే ఆయనకు ఈ వ్యాది సోకిందని ఆ పుకార్ల సారాంశం. ప్రస్తుతం ఈ పుకారు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో రిద్ధిమా కపూర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. “దయచేసి మీరు ట్వీట్ చేసే ముందు మీరు రాస్తున్న దాంట్లో నిజం ఎంతో తెలుసుకోండి.. ఆ వార్త నిజమని ధృవీకరించిన తర్వాత రాయండి.. మేమంతా బాగున్నాం! ధన్యవాదాలు!" అంటూ ఆ రూమర్‌.. జస్ట్ రూమరేనంటూ ఖండించింది.








View this post on Instagram





Attention seeking ??? Least verify/ clarify ! We are fit We are good ! Stop spreading rumours ! #lunatics


A post shared by Riddhima Kapoor Sahni (RKS) (@riddhimakapoorsahniofficial) on





ఇక అమితాబ్‌కు కరోనా సోకడంతో ఆయన తర్వగా కోలుకోవాలని.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా దేవున్ని ప్రార్ధించాడు. అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కూడా త్వరగా కోలుకోవాలంటూ ట్వీటాడు. అక్కినేని నాగార్జున, రవితేజ, దర్శకుడు గుణ శేఖర్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ కరోనా నుండి త్వరగా బయటపడాలనీ ప్రార్ధిస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: July 12, 2020, 8:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading