RICHA GANGOPADHYAY GIVES CLARITY ON HER MARRIAGE WITH HER LOVER HERE ARE THE DETAILS SR
పెళ్లిపై వచ్చిన ఆ వార్తల్నీ ఖండిస్తూ.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ భామ..
Twitter
రిచా గంగోపాధ్యాయ.. ఈ అందాల ముద్దుగుమ్మ శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్లో వచ్చిన లీడర్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. అది అలా ఉంటే రిచా ఇటీవల తన పెళ్లిపై వచ్చిన కొన్ని వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
రిచా గంగోపాధ్యాయ.. ఈ అందాల ముద్దుగుమ్మ శేఖర్ కమ్ముల, రానా కాంబినేషన్లో వచ్చిన లీడర్‌తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత హాట్, హాట్ అందాలతో రవితేజ ‘మిరపకాయ’, ప్రభాస్ ‘మిర్చి’ వంటి సినిమాల్లోఅదరగొట్టిన సంగతి తెలిసిందే. సినిమాల్లో అదిరిపోయే ఆఫర్స్‌తో దూసుకుపోతున్న సమయంలోనే నటనకు బైబై చెప్పి, హయ్యర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్లింది. ఆ తర్వాత అక్కడ తోటి స్టూడెంట్ను ప్రేమించి ఇటీవలే పెళ్లి కూడా చేసుకుంది. దానికి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. రిచా పెద్దలకు తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని..సోషల్ మీడియా కోడై కూసింది. ఈ విషయాన్ని రిచా ఖండించింది. ఆమె స్పందిస్తూ.. అసలు తన పెళ్లి ఎప్పుడో మూడు నెలల క్రితం జరగిందని..తనపై ఈ రకమైన వార్తల్లో ఎందుకు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. నేను పెరిగిన మిచిగాన్ ప్రాంతంలో ఇండియా, అమెరికా సంప్రదాయాల ప్రకారం మా వివాహం అందంగా జరిగిందని పేర్కోంది. మా కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగింది. ఓ మంచి కుటుంబానికి కోడల్ని కావడం నా అదృష్టం భావిస్తున్నానని తెలిపింది. నేను చిత్ర పరిశ్రమ నుంచి దూరం అయి ఆరేళ్లు కావొస్తున్నా.. ఇప్పటికీ అభిమానుల ఆదరణ, ప్రేమ లభించడం ఆశ్చర్యంగా ఉందని. ఈ విషయంలో నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను.. అంటూ రిచా తన సోషల్ మీడియాలో ద్వారా స్పందించారు.
Thanks everyone for the kind wishes 🤗🥰. Married a little over 3 months to the love of my life and couldn't (cont) https://t.co/N7kZJvSf8h
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.