బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి నెల రోజులు కంప్లీట్ అయింది. గత నెల 14న ఆయన తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా కూడా ఈయన మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హీరోగా మంచి కెరీర్ వదిలేసి అర్ధాంతరంగా చనిపోవాల్సిన అవసరం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు లేదని.. ఆయన్ని ఎవరో పక్కా ప్లాన్ ప్రకారమే చంపేసారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ సుశాంత్ నిజంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎందుకు ఈ కేసులో ఎన్నో సాక్ష్యాధారాలను ప్రజల ముందుకు తీసుకురావడం లేదని అడుగుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే సిబిఐ ఎంక్వైరీకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు అప్పగించాలంటూ ఒత్తిళ్లు కూడా ప్రభుత్వంపై భారీగానే వస్తున్నాయి.తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తి ఈయన మృతిపై సీబీఐతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేసారు.
నాకు ఈ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. న్యాయాన్ని నిలబెట్టడానికి సీబీఐ విచారణకు కేంద్రం అనుమతి ఇవ్వాలి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనే తీవ్రమైన నిర్ణయాన్ని సీబీఐ బయటకు తీసుకువస్తుందనే నమ్మకం తనకు ఉందంటూ సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ను ముగించింది. కాగా సుశాంత్ ఆత్మహత్య నేపథ్యంలో రియా చక్రబర్తికి కొంత మంది బెదిరింపులకు దిగారు. నీ వల్లే అతను చనిపోయాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అందులో కొంత మంది రియా చక్రబర్తిని లైంగిక దాడి చేసి చంపేస్తానని బెదిరించినట్టు రియా ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌ను స్క్రీన్ షాట్ చేసి చూపించారు. అంతేకాదు తనపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులపై రియా చక్రబర్తి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యపై బిహార్‌లోని ఆయన అభిమానులతో పాటు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సీబీఐ ఎంక్వైరీ జారీ చేయాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bollywood, Rhea Chakraborty, Sushant Singh Rajput