బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేసుని బీహార్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో.. రంగంలో దిగిన సీబీఐ దృష్టికి డ్రగ్స్ కోణం వచ్చింది. ఇంకేముంది.. రంగంలోకి నార్కోటిక్ విభాగం అధికారులు దిగారు. ఈ కేసు విచారణలో సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు సహా మరికొంత మందిని అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజులు రియా జైలుకే పరిమితం అయ్యింది. తర్వాత ఆరోగ్య సమస్యలున్నాయంటూ చెప్పి బెయిల్ తెచ్చుకుంది. చాలా కండీషన్స్ మీద కోర్టు రియా చక్రవర్తిని బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు రియా ఇంటికే పరమితమైంది.
అయితే త్వరలోనే రియా చక్రవర్తి షూటింగ్స్‌లో పాల్గొనబోతుందని సుశాంత్ సింగ్ స్నేహితుడు రూమీ జాఫరీ తెలియజేశాడు. రీసెంట్‌గానే రియా చక్రవర్తిని కలిసి తాను మాట్లాడానని ఆయన అన్నాడు. రియా జైలు జీవితం వల్ల కలిగిన ఇబ్బంది నుండి ఇంకా కోలుకోలేదని రూమీ తెలిపాడు. ఫిబ్రవరిలో షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పాడు. అయితే ఏ సినిమాలో నటిస్తుంది, ఎప్పుడు నటిస్తుందనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.
మరికాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత సీబీఐ దర్యాప్తులో కేసుకు సంబంధించి రియా చక్రవర్తి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. మరి చివరకు సీబీఐ దర్యాప్తులో సుశాంత్ సింగ్‌ది హత్యా, ఆత్మహత్యా అనేది తెలనుందో లేదో. నార్కోటిక్ అధికారులు సైతం డ్రగ్స్ కేసులో ఉన్నట్లు భావించిన స్టార్స్ దీపికా పదుకొనె, సారా అలీఖాన్ సహా కొంత మందిని విచారణకు పిలిచారు. మరి వారెలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bolllywood, Drugs, Rhea Chakraborty